2020 Tip Challenege : రెస్టారెంట్ సర్వర్‌ కి లక్షకు పైగా టిప్ ఇచ్చిన సింగర్

  • Publish Date - January 4, 2020 / 09:35 AM IST

డోన్నీ వాల్బెర్గ్‌ (సింగర్-యాక్టర్)కు ఎంత గొప్ప మనసో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతన్ని మెచ్చుకోని వారేలేరు. ఎందుకో తెలిస్తే మీరు కూడా  మెచ్చుకోకుండా ఉండలేరు. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ఓ రెస్టారెంట్‌కి వెళ్లి… సర్వర్‌ కి టిప్ కింద… $2020 (రూ.1.44లక్షలు) ఇచ్చాడు.  2020 టిప్ ఛాలెంజ్‌ కింద  అంత టిప్ ఇచ్చాడు. నిజానికి ఈ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు.

కానీ, డోన్నీ భార్య జెన్నీ మెక్‌కార్తీ ఆ బిల్లును షేర్ చెయ్యడంతో ఆ విషయం ప్రపంచానికి తెలిసింది.   డోన్నీ ఏకంగా అంత టిప్ ఇవ్వడంపై అతని భార్య జెన్నీ మెక్‌కార్తీ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. తన భర్త అద్భుతమైన వ్యక్తి అని పొగడ్తలతో ముంచేసింది.

ఇక మాములుగా ఎవరైన చిన్న మంచిపని చేస్తేనే.. జనాలు దాన్ని ఎక్కడికో తీసుకుపోతారు. మరి ఇంత మంచి పని చేశాక… సోషల్ మీడియా సైలెంట్‌ గా ఎందుకుంటుంది. నెటిజన్లు డోన్నీని ప్రశంసలతో  ముంచెత్తుతున్నారు.