వైరల్ ఫోటో : ఏకే-47 తుపాకీ మింగేసిన పాము..!!

  • Publish Date - January 30, 2020 / 06:10 AM IST

పాములు ఆహారంగా ఎన్నో చిన్న చిన్న జంతువుల్ని మింగేస్తుంటాయి. కానీ ఓ భారీ నల్లటి పాము ఏకంగా AK-47 గన్ నే మింగేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.నైజీరియాలోని చాడ్ బేసిన్ నేషనల్ పార్క్ నైరుతీ ప్రాంతంలో ఒక పాము ఎకె -47 తుపాకీని మింగినట్లు సమాచారం.  

సాధారణంగా చిన్న పాములు వాటి కంటే చిన్నవైన జీవులను స్వాహా చేయడం.. అలాగే పెద్ద పాములు పెద్ద పెద్ద జంతువుల్ని మింగేందుకు ప్రయత్నించడం మనం చూసి ఉంటాం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలో మాత్రం ఓ భారీ పాము ఏకంగా ఏకే-47 తుపాకీనే మింగేసింది.  దీంతో ఈ ఫొటో షేర్ చేసిన గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. @paeh_judin అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఫొటోను షేర్ చేశాడు. 

అంతే.. అతను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 13వేల రిట్వీట్స్, 11వేలకు పైగా లైక్స్ వచ్చి పడ్డాయి. ఇదిలాఉంటే ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను చాలా కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఇది నిజమైనదేనా? లేక ఫొటోషాపులో చేసి పెట్టారా? అని డైలమాలో పడ్డారు. దీనిపై నెటిజన్లు వారి వారి స్టైల్లో స్పందిస్తున్నారు. ఫన్నీ ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు. “SN-AK-47” అనే జోక్ అని ఒకరు అంటే..మరొకరు AK-47 పాము ‘హిస్‌..హిస్..’ అని సౌండ్ చేస్తుందా? తుపాకీ పేలి నప్పుడు వచ్చే శబ్ధం వస్తుందా? అంటూ కామెంట్ చేశారు.ఏదీ ఏమైనా ఈ ఫోటోను మాత్రం నెటిజన్లు తెగ వైరల్ చేసేస్తున్నారు.కాగా ఈపాము ఘటన నైజీరియాలో అని..కాదు కాదు రష్యాలో అని కొన్ని వార్తలు వచ్చాయి. కీనీ ఏది ఏమైనా ఈ ఫోటో మాత్రం వైరల్ అయ్యింది.