గాల్లో గిటార్ వాయించేస్తున్న చిన్నారి రాక్ స్టార్లు..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ముగ్గురు పిలకాయలు తెగ పాడేస్తున్నారు. చేతిలో గిటార్ లేదు..పొడవాటి పుల్ల పట్టుకుని తెగ పాడేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముగ్గురు పిల్లలు కోరస్ మిస్ కాకుండా పాడటం..ఈ ముగ్గురిలో ఇద్దరు పిల్లలు మాత్రం పక్కా రాక్ స్టార్లలా ఎక్స్ ప్రెషన్ తో సహా పాడేస్తున్నారు.
రాక్ స్టార్స్ అంటే ఓ గిటార్…డిఫరెంట్ హెయిర్ స్టైల్…స్పెషల్ డ్రెస్సింగ్ తో ఉంటారు. కానీ సోషల్ మీడియాలో ఈ ముగ్గురు రాక్ స్టార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. రాక్ స్టార్స్ ఫోజుల్తో ఓ పాట పాడారు. అంతేకాదు… అందులో ఒకడు తన చేతిలో కర్రనే గిటార్‌గా ఫీల్ అయ్యి వాయిస్తుంటే… మిగతా వాళ్లు కూడా తమ చేతుల్లో ఏం లేకపోయినా… గిటార్ వాయిస్తున్న కటింగ్ ఇచ్చారు. చూడటానికి ఎంతో క్యూట్‌గా అనిపించే ఈ వీడియో ఫిట్ భారత్ అనే పేరుతో ట్విట్టర్లో పోస్టు అయ్యింది.
దీంతో ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు వైలర్‌గా మారింది. నెటిజన్లంతా ఈ ముగ్గురు చిన్నారుల ఫెర్ ఫామెన్స్‌కు ఫిదా అయిపోయారు. సో క్యూట్ రాక్ స్టార్ట్స్ అంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరు ఫెర్‌ఫామెన్స్ అద్దిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఈ రాక్ స్టార్స్ టీమ్ లో మేం కూడా పాటిస్పేట్ చేస్తామంటూ ట్వీట్లు పెట్టారు.
Where will this Rock Band playing on Saturday Night?? ??
We want to join them ??#SaturdayThoughts pic.twitter.com/3YMlvTJuP3— Fit Bharat (@FitBharat) December 21, 2019