వెనీస్ నగరం మునిగింది.. టూరిస్ట్ కూడా మునిగాడు: వైరల్ వీడియో

  • Publish Date - November 26, 2019 / 09:52 AM IST

వెనీస్ వెళితే కచ్చితంగా గోండోలా వాటర్ వేస్ చూడాల్సిందే. ఈ వాటర్ వేస్ అంతా తిరిగి చూడాలంటే పడవలోనే వెళ్లాలి.  అయితే ఇప్పుడు మాత్రం ఆ వెనీస్ నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా నీళ్లే కనపడుతున్నాయి. సుమారు 50 ఏళ్ల తర్వాత ఇలా నగరమంతా జలమయమైంది.

నవంబరు 12న సముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. నీటి మట్టం 187 సెంటీ మీటర్లకు పెరిగింది. 1966 తర్వాత అంత నీటి మట్టం పెరగడం ఇదే తొలిసారి. అప్పట్లో నీటిమట్టం 194 సెంటీమీటర్లకు పెరగడంతో వెనీస్ నగరం మునిగిపోయింది.

ఇక నగరంలో పడవల్లో ప్రయాణిస్తూ సెల్ఫీలు దిగల్సిన పర్యాటకులు.. ఇప్పుడు నీటిలో నడుస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి వరదలో నడుస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాడు. అయితే ఇన్నట్టుండి ఒక్కసారిగా నేరుగా కాలువలోకి నడుచుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజనులు కొంతమంది జాలి చూపుతుంటే, ఇంకొందరు మాత్రం పగలబడి నవ్వుతున్నారు.