Vande Bharat Express now suffers jammed wheel
Vande Bharat Express: రైల్వేశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వరుస ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. గత రెండు రోజుల్లో ముంబై-గాంధీ నగర్ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండుసార్లు పశువులను ఢీకొని ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో వందే భారత్ రైలులో సాంకేతిక సమస్య ఏర్పడి ఆగిపోయింది. ఢిల్లీ-వారణాసి మధ్య నడిచే రైలు ఇది.
ఉత్తరప్రదేశ్‌లోని డంకౌర్, వైర్ స్టేషన్ల మధ్య ట్రాక్షన్ మోటార్లో బేరింగ్ లోపం తలెత్తినట్టు భారత రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్‌సీఆర్ టీమ్‌ను రప్పించి బేరింగ్ జామ్‌ను సరి చేసినట్టు తెలిపింది. ఏడీఆర్ఎఎం ఓపీ ఢిల్లీ సారథ్యంలోని ఎన్ఆర్, ఎన్‌సీఆర్‌కు చెందిన ఆరుగురు అధికారుల సంయుక్త బృందం పరిస్థితిని సమీక్షించిందని, ర్యాక్‌ను మెయింటెనెన్స్ డిపోకు తరలించిన వెంటనే సాంకేతక లోపంపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆ ప్రకటన తెలిపింది.
సాంకేతిక కారణంతో రైలు ఆరు గంటల పాటు ఆలస్యంగా నడిచింది. దీంతో అందులోని ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో తరలించినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
KTR Attacks Bandi Sanjay: బండి సంజయ్‌ను లవంగం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ కేటీఆర్