వృద్ధ జంటకు కరోనా వైరస్: బాధలోనూ భార్యపై తగ్గని ప్రేమ… వీడియో వైరల్

  • Publish Date - February 14, 2020 / 07:06 AM IST

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ పేరును COVIND 19 గా మార్చబడింది. COVID19 పేరు వినపడితే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. అటువంటి COVIND 19 వైరస్ తో బాధపడుతున్నా ఓ  వృద్ధ జంట మధ్య ఉండే ప్రేమకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు వివరాల్లోకి వెళ్తే… ప్రాణాంతకమైన COVIND 19 వ్యాధి సోకటంతో ఓ వృద్ధ జంట హాస్పటల్ లో చేరారు. వేర్వేరు వార్డులో చికిత్స పొందుతున్నారు. 87 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి వైరస్ తో బాధపడుతున్నా, తన భార్యను చూడాలని అనుకున్నాడు. దాంతో ఆ వ్యక్తి సీలెన్ బాటిల్ తో భార్యను చూడటానికి వచ్చాడు. అంతేకాకుండా ఎంతో ఓపికగా భార్యకు ఆహారాన్ని తినిపించాడు. నీళ్లను తాగ్రించాడు. 

ఈ వీడియోని చైనాలోని పీపుల్స్ డైలీ ‘నేను నిన్ను ఎప్పటికి ప్రేమిస్తాను’ అనే క్యాప్షన్ తో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోని ఇప్పటివరకు లక్షకు పైగా వీక్షించారు. ఇది నిజమైన ప్రేమ చూడటానికి చాలా అందంగా ఉంది. మీరు త్వరగా కోలుకోవాలని దేవుడిన్ని ప్రార్థిస్తున్నాం. ప్రేమ వైరస్ ను జయిస్తుందని మేము ఆశిస్తున్నాం అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇప్పటివరకు ప్రాణాంతకమైన వైరస్ తో చైనాలో 1483 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 64,627 కు చేరుకుంది.