Wedding Card: అప్పట్లో వెడ్డింగ్ కార్డు.. ఇప్పుడు వైరల్‌గా ట్విట్టర్‌లో

పెళ్లి అంటే గుర్తుకొచ్చేది రెండే రెండు విషయాలు. ఒకటి కట్నకానుకలు, రెండు పార్టీలో విందు విశేషాలు. సంవత్సరాలుగా మారుతున్న పెళ్లి వేడుకల స్టైల్ తో వెడ్డింగ్ కార్డ్ కూడా మారుతూ వచ్చింది.

Wedding Card

Wedding card: పెళ్లి అంటే గుర్తుకొచ్చేది రెండే రెండు విషయాలు. ఒకటి కట్నకానుకలు, రెండు పార్టీలో విందు విశేషాలు. సంవత్సరాలుగా మారుతున్న పెళ్లి వేడుకల స్టైల్ తో వెడ్డింగ్ కార్డ్ కూడా మారుతూ వచ్చింది. అప్పట్లో కార్డులోనే మొత్తం తినే పదార్థాలన్నీ మెనూలా ఉంచేశారు. పాత విషయాలు ఎప్పుడైనా స్పెషల్ గానే అనిపిస్తాయి.

బెంగాల్ లో 1990వ సంవత్సరం ప్రింట్ చేయించిన వెడ్డింగ్ కార్డ్ కూడా అలాగే ఉంది. ఈ కార్డ్ ఫొటోను జులై 4న ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అలా వైరల్ అయిపోయింది. ‘నా పేరెంట్స్ వెడ్డింగ్ రిసెప్షన్ మెనూ కార్డ్ దొరికింది’ అంటూ పోస్టు చేయడంతో నెట్టింట్ వైరల్ గా మారడంతో 90ల్లో వెడ్డింగ్ కార్డ్ ఫుడ్ మెనూ కాంప్లిమెంట్లు అందుకుంటోంది.