Baba Ka Dhaba: బాబా కా ధాబా ఓనర్ కంప్లైంట్‌కు రూ.4.5లక్షలు తిరిగిచ్చిన యూట్యూబర్

బాబా కా ధాబా ఓనర్ కంప్లైంట్‌కు యూట్యూబర్ కంగుతిన్నాడు. అతనికి వచ్చిన రూ.4.5లక్షల డొనేషన్ ను తిరిగిచ్చాడు. కొద్ది రోజుల క్రితం తనకు రావాల్సిన డబ్బు ఇవ్వలేదని ఆ ధాబా యజమాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.

Baba Ka Dhaba

Baba Ka Dhaba: బాబా కా ధాబా ఓనర్ కంప్లైంట్‌కు యూట్యూబర్ కంగుతిన్నాడు. అతనికి వచ్చిన రూ.4.5లక్షల డొనేషన్ ను తిరిగిచ్చాడు. కొద్ది రోజుల క్రితం తనకు రావాల్సిన డబ్బు ఇవ్వలేదని ఆ ధాబా యజమాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. దానిపై వెనక్కుతగ్గిన యూట్యూబర్ గౌరవ్ వాసన్ డబ్బులిస్తూ.. తాను దొంగను కాదని, అతనిపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోవడానికి నిరాకరించడంతోనే ఇలా చేశానని చెప్పాడు.

ఢిల్లీలోని మాల్వీయ నగర్‌లో రోడ్డు పక్కన బాబా కా దాబా అనే చిన్న స్టాల్‌లో ఆహారాన్ని విక్రయించే కాంతాప్రసాద్ దంపతులు గతేడాది కోవిడ్ లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో 2020 అక్టోబర్ 7న గౌర‌వ్ వాస‌న్ అనే ఓ యూట్యూబ‌ర్ కాంతా ప్రసాద్‌, అత‌ని భార్య నిర్వ‌హిస్తున్న దాబాపై తీసిన వీడియో తీసాడు. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్ వల్ల చితికిపోయిన ఆ పెద్దాయన తన కష్టాలను ఆ వీడియోలో షేర్ చేసుకున్నారు.

వాళ్లు ఎంతో క‌ష్టంగా బతుకీడుస్తున్నార‌ని, ఆదుకోవాల‌ని స‌దరు యూట్యూబ‌ర్ త‌న ఫాలోవ‌ర్ల‌ను కోరాడు. ఆ వెంట‌నే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిపోయింది. దీంతో బాబా కా దాబా స్టాల్ వద్దకు ఢిల్లీ ప్రజలు క్యూ కట్టారు. ఆ వృద్ధ దంపతులను ఆదుకునే ప్రయత్నం చేశారు. కాంతా ప్ర‌సాద్‌కు స‌పోర్ట్ చేయండంటూ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా కోరారు. దీంతో బాబా కా దాబా మరింత ఫేమ‌స్ అయింది. ఈ సమయంలో దేశం న‌లుమూల‌ల నుంచి త‌న‌కు వ‌చ్చిన విరాళాల విష‌యంలో ఆ యూట్యూబ‌ర్ గౌర‌వ్ వాస‌న్‌, కాంతా ప్ర‌సాద్ మ‌ధ్య వివాదం కూడా చెల‌రేగింది. ఈ క్రమంలో యూట్యూబర్ గౌరవ్ వాసన్ పైన కాంతాప్రసాద్ చీటింగ్ కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే.

రెండ్రోజుల క్రితం.. ‘బాబా కా దాబా’ ఓన‌ర్ కాంతా ప్ర‌సాద్ (81) ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. గురువారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా..ఆయనని వెంట‌నే స‌ఫ్ద‌ర్‌జంగ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. గురువారం రాత్రి ఓ వ్యక్తి ఆత్మహత్యానికి ప్రయత్నించాడని,అతడు హాస్పిటల్ లో చేర్చించబడ్డాడని తమకు ఓ ఫోన్ కాల్ వచ్చింది వెంటనే తాము హాస్పిటల్ కి వెళ్లి చూడగా..ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని కాంతా ప్రసాద్ గా గుర్తించామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం కాంతాప్రసాద్ కి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. కొద్ది రోజులుగా డిప్రెషన్ తో బాధపడుతున్న కాంతాప్రసాద్ గత రాత్రి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడని ఆయన భార్య చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాంతా ప్ర‌సాద్ నిద్ర‌మాత్ర‌లు మింగిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. ఆ వెంట‌నే అత‌డు స్పృహ కోల్పోయిన‌ట్లు తెలిపారు. దీనిపై పోలీసులు త‌దుప‌రి విచార‌ణ జ‌రుపుతున్నారు.