AP Rains: మరో అల్పపీడనం..! ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల్లో కుండపోత వానలు..
లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగి పొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.
- Naveen
- Published On : August 24, 2025 / 07:11 PM IST
AP Rains
AP Rains: ఐఎండీ సూచనల ప్రకారం రేపు (ఆగస్ట్ 25) వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు.
ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ దగ్గర ఉండరాదని హెచ్చరించారు.
లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగి పొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.
రానున్న మూడు రోజులు వాతావరణం ఈ విధంగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అంచనా వేశారు.
సోమవారం (25-08-25)
* శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు పడే ఛాన్స్.
మంగళవారం (26-08-25)
* శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
* కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్.
బుధవారం (27-08-25)
* శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
* పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం.
మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.
Also Read: నోయిడా వరకట్నం హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై కాల్పులు జరిపిన పోలీసులు..
