AP Heatwave Alert: వెదర్ డబుల్ గేమ్.. ఓవైపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మరోవైపు ఈ జిల్లాల్లో వడగాల్పులు.. రాబోయే 2 రోజులు..
ఇక ఏపీలో టెంపరేచర్లు ఠారెత్తిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో అత్యధికంగా 44.1°C నమోదైంది.
- Naveen
- Published on- April 29, 2026 / 07:50 PM IST
AP Heatwave Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇలా ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. రేపు, ఎల్లుండి కూడా ఈ తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఒకవైపు ఎండ తీవ్రత ఉండనుంది. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ఇక ఏపీలో టెంపరేచర్లు ఠారెత్తిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో అత్యధికంగా 44.1°C నమోదైంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 88 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది.
వడగాల్పుల హెచ్చరిక (30-04-26):
* విజయనగరం జిల్లా 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
* పార్వతీపురం మన్యం జిల్లాలో 6 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
* అల్లూరి జిల్లా అనంతగిరిలో కూడా తీవ్ర వడగాల్పుల హెచ్చరిక
* మొత్తం 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 20 మండలాల్లో సాధారణ వడగాల్పులు
అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు:
* కొమ్మిపాడు – 44.1°C
* దేవరపల్లి – 43.4°C
* బెల్లంకొండ – 43.3°C
* నందనమారెళ్ళ – 43.2°C
* గంగవరం – 42.8°C
* నగరడోన – 42.7°C
* దొరవారిసత్రం – 42.5°C
* తొర్రగుడిపాడు – 42.4°C
* మక్కువ, విఆర్ పురం – 42.2°C
* చాగలమర్రి, కొప్పెరపాడు, లింగాల – 42.1°C
* రాయదుర్గం – 42°C
వర్షాల సూచన:
* ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు
* విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులతో వర్షాలు
* అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
జాగ్రత్తలు:
* ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దు
* రైతులు, పశుకాపరులు అప్రమత్తంగా ఉండాలి
* తీవ్ర ఎండల్లో అవసరం లేకుండా బయటకు వెళ్లొద్దు
Also Read: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. గెలుపు ఎవరిది? ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్స్..
