AP Weather: ఏపీకి వడగాలుల హెచ్చరిక.. రేపు ఈ జిల్లాల్లో మంటలే.. బయటికి రావొద్దు..

తీవ్రమైన ఎండలు, వేడిగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

  • Published on- May 17, 2026 / 06:36 PM IST

AP Weather: ఏపీలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కంభంలో అత్యధికంగా 43.3°C ఉష్ణోగ్రత నమోదైంది. 14 జిల్లాల్లోని 65 మండలాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవడం ఎండల తీవ్రతకు అద్దం పడుతుంది. ఇక, రేపు ఎండలు మరింత మండిపోనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 15 జిల్లాల్లో 42-44°C వరకు టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉందంది. ఇక, 28 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 245 మండలాల్లో సాధారణ వడగాలుల ప్రభావం ఉండనుంది. తీవ్రమైన ఎండలు, వేడిగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

అనవసరంగా ఎండలో తిరగొద్దని, ఇంట్లోనే ఉండాలని చెప్పింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలంది. ఎండలో తిరగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలంది. వడ దెబ్బ బారిన పడకుండా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పింది.

మరోవైపు మన్యం, అల్లూరి, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాల కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడొద్దని సూచించింంది. పంట పొలాల్లో పని చేసే రైతులు, పశుకాపరులు అప్రమత్తంగా ఉండాలంది.

Also Read: తాలిబన్ల కొత్త రూల్స్.. ‘పెళ్లప్పుడు కన్య మౌనంగా ఉంటే..’