AP Heatwave: బీకేర్ ఫుల్.. రేపు బయటకు రావొద్దు.. ఏపీకి వడగాల్పులు హెచ్చరిక..
రాయలసీమలో 40-42°C వరకు.. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో 43-44°C వరకు టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉందంది.
- Naveen
- Published on- May 27, 2026 / 05:36 PM IST
AP Heatwave: ఏపీలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల హెచ్చరిక చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 155 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో 45-46°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమలో 40-42°C వరకు.. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో 43-44°C వరకు టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉందంది.
మరోవైపు పిడుగులతో కూడిన వర్షాల సూచన చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. బాపట్ల, ప్రకాశం, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. పిడుగుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడొద్దని హెచ్చరించింది.
బుధవారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు..
సాలూరు – 41.8°C
కుక్కునూరు, కూనవరం – 41.6°C
ఎస్.రాయవరం – 41.5°C
చీరాల – 41.1°C
ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలకు సూచనలు..
ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి.
వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
షుగర్, బీపీ, గుండె సమస్యలున్న వారు ఎండలో తిరగొద్దు.
Also Read: స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలకు కీలక సూచనలు చేసిన వైఎస్ జగన్.. అలాచేస్తే ఇబ్బందులు తప్పవ్..
