నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
దక్షిణ శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో ఉదయం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. రాగల 24 గంటల్లో తమిళనాడు, శ్రీలంక మధ్య కోమోరిన్, దాని పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా మారే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణపై ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ‘క్యార్’ తుపాన్ ప్రభావం ఎంత మాత్రం తెలంగాణ రాష్ట్రంపై ఉండబోదని వెల్లడించింది.
విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల నుంచి రైతులు ఇంకా కోలుకోలేదు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా… జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలు ముంపుకు గురయ్యాయి. అయితే వర్షాలు తగ్గినప్పటికీ, ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ముంపునీటిలోనే పంటలు తేలుతున్నాయి. వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాలు తగ్గిపోయి, ప్రస్తుతం వాతావరణం పొడిగా మారినప్పటికీ వరదనీరు మాత్రం ఇంకా పంట పొలాలను వదలలేదు. ఎస్.కోట, బొబ్బిలి, గజపతినగరం నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది.