Weather Updates: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక..

ఇక మంగళవారం సాయంత్రం 5 గంటలకు కాకినాడ జిల్లా డి.పోలవరంలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

  • Updated on- October 7, 2025 / 06:21 PM IST

AP Rains

Weather Updates: ఏపీకి వర్ష సూచన చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో బుధవారం వానలు కురుస్తాయంది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇక మంగళవారం సాయంత్రం 5 గంటలకు కాకినాడ జిల్లా డి.పోలవరంలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లిలో 70.5 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 66.5 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా కోటనందూరులో 64.7 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా చినపవానిలో 57మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా పైనంపాడులో 56.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Also Read: పెన్షన్లు అందడం లేదా? మీకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే సరి.. ఇకపై..