సర్పంచ్ వీరంగం : మద్యం బాటిల్‌తో బతుకమ్మ ఆట

  • Published By: veegamteam ,Published On : September 30, 2019 / 02:36 AM IST
సర్పంచ్ వీరంగం : మద్యం బాటిల్‌తో బతుకమ్మ ఆట

బతుకమ్మ పండుగ. తెలంగాణా ఆత్మగౌరవానికి ప్రతీగా జరుపుకుంటారు. ఆడబిడ్డలకు సుఖసంతోషాలతో ఉండాలని ప్రతీ అన్నదమ్ములు..తల్లిదండ్రులు బతుకు అమ్మా..అని మనసారా ఆశీర్వదించే పండుగ బతుకమ్మ వేడుక. తెలంగాణ సంస్కృతి సంప్రదాయలే కాక..భావోద్వేగాలతో ముడిపడే బతుకమ్మ పండుగను కొంతమంది మందుబాబు అవమాన పరిచారు.

ప్రకృతి ఇచ్చి పువ్వులను దైవంగా భావించి రంగు రంగుల పువ్వులతో బతుకమ్మను చేసి..తిరిగి బతుకమ్మను ప్రకృతికే సమర్పించే ఈ బతుకమ్మ పండుగను గేలి చేసిన దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. మద్యం సీసాను బతుకమ్మగా మధ్యలో పెట్టి దాని చుట్టూ తిరుగుతూ ఆటలాడిన ఘటన జరిగింది. ఆడబిడ్డల పండుగ బతుకమ్మను అవమానిస్తూ..సాక్షాత్తు పంచాయితీ సర్పంచ్ ఇతర నేతలతో కలిసి కార్యాలయం ముందు జరిగిన ఈ  అరాచకపు పని తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. 

వివరాల్లోకి వెళితే..మద్యం సీసాలతో గ్రామ సర్పంచ్‌..స్థానిక నేతలు కలిసి  బతుకమ్మ ఆడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం తాగిన నేతలు బాటిల్ ను మధ్యలో పెట్టి పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు. 

ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న సమయంలోనే సర్పంచ్‌, కొందరు నేతలు ఇలా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. బాధ్యతాయుతమైన సర్పంచ్ పదవిలో ఉండి ఇటువంటి పనులకు పాల్పడిన సర్పంచ్ ని..ఇతర నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి. 

ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామంలో శనివారం (సెప్టెంబర్ 20) రాత్రి ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకల్లో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్‌తో పాటు మరి కొందరు మద్యం బాటిళ్లు పెట్టి .. డీజే పెట్టి బాటిళ్ల చుట్టూ ఎగురుతూ డ్యాన్స్‌ చేశారని మహిళలంతీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ సంప్రదాయాన్ని కించపరుస్తూ మద్యం బాటిళ్లతో డ్యాన్స్‌లు చేసిన సర్పంచ్‌, ఇతర నేతలపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.