ఏం బ్యాటింగ్ భయ్యా.. ఓపెనర్లుగా దిగి సెంచరీలు బాదిన శుభ్‌మన్ గిల్, సుదర్శన్

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఓపెనర్లు ఈ ఘనత సాధించారు.

ఏం బ్యాటింగ్ భయ్యా.. ఓపెనర్లుగా దిగి సెంచరీలు బాదిన శుభ్‌మన్ గిల్, సుదర్శన్

@gujarat_titans

ఓపెనర్లుగా దిగి సెంచరీలు బాదారు గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, సుదర్శన్. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో ఈ రికార్డు సాధించారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.

శుభ్‌మన్, సుదర్శన్ మొదటి నుంచి మైదానంలో సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించారు. సెంచరీలు బాదాక సుదర్శన్,  శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యారు. సాయిసుదర్శన్ 51 బంతుల్లో 7 సిక్సులు, 5 ఫోర్లతో 103 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 55 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సులతో 104 పరుగులు బాదాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ 16 (నాటౌట్), షారుక్ ఖాన్ 2 పరుగులు తీశారు. గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీశాడు.

గుజరాత్ టైటాన్స్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్