Viral Video : బాబోయ్.. ప్రతీకారం తీర్చుకున్న గాడిద.. తనను తీవ్రంగా కొట్టి హింసించిన యువకుడికి ఆ గాడిద ఎలా బుద్ధి చెప్పిందో చూడండి

Donkey Revenge : అత్యంత క్రూరంగా గాడిదతో ప్రవర్తించాడు. తీవ్రంగా కొట్టాడు. హింసించాడు. బాధపెట్టాడు. ఆ శాడిస్ట్ కు గాడిద ఏ విధంగా గుణపాఠం చెప్పిందంటే..

Viral Video : బాబోయ్.. ప్రతీకారం తీర్చుకున్న గాడిద.. తనను తీవ్రంగా కొట్టి హింసించిన యువకుడికి ఆ గాడిద ఎలా బుద్ధి చెప్పిందో చూడండి

Donkey Revenge(Photo : Twitter)

Donkey Revenge : మూగజీవాల పట్ల వీలైతే ప్రేమ చూపించాలి. వాటి పట్ల కాస్త జాలి, దయతో ఉండాలి. జాలి, దయ, ప్రేమ.. ఇవేవీ చూపించకపోయినా పర్లేదు. కానీ, నోరులేని జీవాలను హింసించడం కరెక్ట్ కాదు. నోరు లేదా కదా ఏం చేస్తాయిలే అని వాటితో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాము.. కొట్టి, హింసిస్తాము అంటే చెల్లదు. కొన్ని సందర్భాల్లో మూగజీవాలు సైతం ప్రతీకారం తీర్చుకుంటాయి. తమపై దాడి చేసి హింసించిన వారికి గట్టిగా బుద్ధి చెబుతాయి. జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పుతాయి. అలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ యువకుడు గాడిదను తీవ్రంగా కొడతాడు. కాలితో చాలా బలంగా పలుమార్లు దాని మూతి మీద కొడతాడు. ఆ తర్వాత చేత్తో బలంగా మూతి మీద కొడతాడు. దాన్ని కొట్టి కొట్టి హింసిస్తాడు. పాపం ఆ మూగజీవి బాధతో విలవిలలాడుతుంది. కానీ, వాడు మాత్రం కనికరం చూపలేదు. అత్యంత క్రూరంగా గాడిదతో ప్రవర్తించాడు. మృగంలా దాన్ని బాధపెట్టాడు. కాసేపటి తర్వాత ఆ గాడిద మీదకు ఎక్కాడు.

Also Read..Boy Dead : చాక్లెట్ దొంగిలించాడని బాలుడిని కొట్టిన మాల్ మేనేజర్.. కాసేపటికే ఊహించని ఘోరం

తనను తీవ్రంగా కొట్టి హింసించిన యువకుడు తన మీదకు ఎక్కగానే.. గాడిద వాడి కాలిని తన నోటితో కొరికేసింది. చాలా గట్టిగా కొరికేసింది. అస్సలు వాడి కాలుని వదల్లేదు. దాంతో ఆ యువకుడు నొప్పితో విలవిలలాడిపోయాడు. బాధతో గట్టిగా కేకలు పెట్టాడు. దాని నుంచి విడిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. నేల మీద పడిపోయాడు. కానీ, లాభం లేకపోయింది. నన్నే కొడతావా? చావరా చావు.. అన్న రీతిలో గాడిద వాడి కాలుని గట్టిగా కొరికేసింది. వాడు నేల మీద పడి బాధతో ఆర్తనాదాలు పెడుతున్నా.. గాడిద అస్సలు వదల్లేదు. ఏమాత్రమూ కనికరం చూపలేదు.

అలా ఆ గాడిద తన ప్రతీకారం తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషలో మీడియాలో వైరల్ గా మారింది. ఆ శాడిస్ట్ కి తగిన శాస్తి జరిగిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మూగజీవాలతో అమానుషంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోకతప్పదని అంటున్నారు. తనను కొట్టి హింసించిన ఆ శాడిస్ట్ కు గాడిద బాగా బుద్ధి చెప్పిందని, మంచి గుణపాఠం నేర్పిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read..Delhi : బైకుల్లో పెట్రోల్ తీసి నిప్పు పెట్టి బైకుల్ని కాల్చేస్తున్న మహిళ .. ఎందుకలా చేస్తోంది?

నోరులేని జీవి పట్ల వాడు ప్రవర్తించిన తీరు క్షమించరాని చర్య అంటున్నారు. వాడికి ఈ శిక్ష సరిపోదని, మరింత కఠిన శిక్ష పడాల్సిందే అంటున్నారు. మొత్తంగా గాడిద ఆ శాడిస్ట్ కు భలేగా బుద్ధి చెప్పిందని, మూగజీవాలను హింసించే వారికి ఇదొక చక్కని గుణపాఠం అని కామెంట్స్ చేశారు.