bull attack : మహిళపై ఎద్దు దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన బాలుడి వీడియో వైరల్

ఒక్కోసారి చిన్న పిల్లలు చేసే సాహసాలు అబ్బురపరుస్తాయి. ఓ మహిళను కాపాడటానికి ఓ బాలుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. చివరికి అతను అనుకున్నది సాధించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఇంతకీ అతను చేసిన సాహసం ఏంటి?

bull attack : మహిళపై ఎద్దు దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన బాలుడి వీడియో వైరల్

bull attack

bull attack :  ఒక్కోసారి జంతువులు (animals) చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాయి. అనూహ్యంగా మనుష్యుల మీద దాడి చేసి ప్రాణాలు తీస్తుంటాయి. తరచూ కుక్కలు దాడిచేసి గాయపరిచిన సంఘటనలు చూస్తున్నాము. తాజాగా ఓ ఎద్దు ( bull) మహిళపై దాడికి దిగడంతో ఓ బాలుడు ఆమెను రక్షించడానికి ఎంతటి సాహసాన్ని ఒడిగడ్టాడో తెలిస్తే అభినందించకుండా ఉండలేం.

Viral Video : షాకింగ్.. మహిళలపై పెరుగుతో దాడి చేసిన వ్యక్తి, వీడియో వైరల్

ఒక వీధిలో మహిళ నడుచుకుంటూ (walking) వెళ్తోంది. ఆమెకు ఎదురుగా వచ్చిన ఎద్దు ఒక్కసారిగా దాడికి (attack) దిగింది. తన కొమ్ములతో ఎత్తి పడేసింది. పాపం కిందపడిపోయిన ఆమె లేవలేని పరిస్థితిలో అలాగే ఉండిపోయింది. దూరం నుంచి ఇదంతా గమనించిన ఓ బాలుడు ఆ మహిళను ఎలాగైనా కాపాడాలని డిసైడై పరుగు పరుగున ముందుకు వచ్చాడు. పాపం అతడిని కూడా ఎత్తి పడేసింది. దాని దెబ్బల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా తగ్గేదేలే అన్నట్లు ఆ చిన్నోడు వెంటనే లేచి ఆ మహిళను లేవదీయడానికి ప్రయత్నించాడు.  మరోసారి ఇద్దరిపై ఎద్దు దాడి చేసి కింద పడేసింది. అప్పటికే అక్కడికి చేరుకున్న స్ధానికులు ఎద్దుని కర్రలతో తరిమి వేయడంతో బాలుడితో పాటు ఆ మహిళ ప్రాణాలతో బయటపడ్డారు.

Wanaparthy: తల్లిని చంపి సంపులో పడేసిన కొడుకు, అతడి భార్య.. నిందితులపై గ్రామస్థుల దాడి

Kumar Manish అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ సంఘటన వైరల్ గా మారింది. చాలామంది ఆ బాలుడి సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి ఆ మహిళను రక్షించడానికి ముందుకు వెళ్లిన తీరుని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.