Viral Video : షాకింగ్.. మహిళలపై పెరుగుతో దాడి చేసిన వ్యక్తి, వీడియో వైరల్

Viral Video : మహిళలతో గొడవపడ్డ వ్యక్తి కోపంతో ఊగిపోయాడు. పెరుగు డబ్బా చేతిలోకి తీసుకున్నాడు. మహిళల నెత్తి మీద పెరుగు పోసేశాడు.

Viral Video : షాకింగ్.. మహిళలపై పెరుగుతో దాడి చేసిన వ్యక్తి, వీడియో వైరల్

Viral Video : ఇరాన్ లోని ఓ షాప్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇద్దరు మహిళలతో గొడవ పడ్డాడు. వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయాడు. వారిద్దరినీ తిట్టాడు. అయినా అతడి కోపం చల్లారలేదు. ఇంతలోనే.. పెరుగు డబ్బా తీసుకుని ఆ మహిళల నెత్తి మీద పోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వ్యక్తి.. మహిళలపై దాడి చేయడానికి కారణం.. ఆ ఇద్దరు మహిళలు హిజాబ్ ధరించకపోవడమే. ఈ ఘటన మషాద్ లోని షాప్ లో జరిగింది. ఇద్దరు మహిళలు (తల్లి, కూతురు) తమకు కావాల్సిన వస్తువులు కొనేందుకు ఓ షాప్ కి వెళ్లారు. అదే సమయంలో షాప్ దగ్గరికి ఓ వ్యక్తి వచ్చాడు. మహిళలు హిజాబ్ ధరించకపోవడం గమనించిన అతడు కోపంతో ఊగిపోయాడు. ఆ ఇద్దరితో గొడవ పెట్టుకున్నాడు. ఎందుకు హిజాబ్ ధరించలేదని వారిని నిలదీశాడు.

Also Read..Delhi : వెరైటీ కోసం పాకులాడి గన్‌తో కేక్ కట్ చేశాడు.. ఆ తరువాత పోలీసులకి చిక్కి…

ఇంతలో.. అంతా చూస్తుండగానే.. సడెన్ గా అతడు షాప్ లో అమ్మకానికి ఉంచిన పెరుగు డబ్బా చేతిలోకి తీసుకున్నాడు. దాన్ని ఆ ఇద్దరు మహిళల తల మీదపై పోసేశాడు. దీంతో ఆ ఇద్దరు మహిళలతో పాటు అక్కడున్న వారు షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే నెత్తి మీద పెరుగు పడిపోయింది. వెంటనే స్పందించిన షాప్ ఓనర్.. పెరుగు చల్లిన వ్యక్తిపై దూసుకెళ్లాడు. అతడిపై దాడి చేశాడు. మహిళలపై పెరుగుతో దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనిపై స్పందించిన పోలీసుల.. హిజాబ్ ధరించనందున ఆ మహిళలపై కోప్పడ్డారు. ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అలాగే, పెరుగుతో దాడి చేసిన వ్యక్తిని కూడా అత్తారింటికి పంపారు. పబ్లిక్ ప్లేస్ లో మహిళలను అవమానపరిచేలా వ్యవహరించాడని, పబ్లిక్ ఆర్డర్ కు విఘాతం కలిగించాడని అతడిపైనా చర్యలు తీసుకున్నారు. హిజాబ్‌ ధరించని మహిళలను షాపులోకి అనుమతించడంతోపాటు ఆ చట్టాన్ని పాటించనందుకు షాపు ఓనర్ కి కూడా నోటీసులిచ్చారు.

ఇరాన్ లో మహిళలకు కఠినమైన డ్రెస్ కోడ్ ఉది. మహిళలు తప్పనిసరిగా తమ తలను కప్పుకోవాలి. వదులుగా ఉండే దుస్తులే ధరించాలి. ఇక, హిజాబ్‌ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో కనిపించే మహిళలపై చర్యలు తీసుకుంటామని, కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ ఇటీవల హెచ్చరించారు. హిజాబ్‌ చట్టాన్ని తప్పని సరిగా పాటించాలని ఆదేశించారు. చట్టం ప్రకారం ఏడేళ్ల వయస్సున్న బాలికలతో సహా మహిళలంతా బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. అయితే హిజాబ్‌ను వ్యతిరేకిస్తున్న ఆ దేశ మహిళలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు.

Also Read..Viral Video: నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన యువకుడు.. విచిత్రంగా చూసిన ప్రయాణికులు

హిజాబ్‌ ధరించని కారణంగా మాసా అమీని అనే యువతిని పోలీసులు గతేడాది అరెస్ట్ చేయగా.. వారి కస్టడీలో ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. మాసా అమీనికి మద్దతుగా ఇరాన్‌లో వేలమంది మహిళలు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేయడంతో నైతిక పోలీసు విభాగాలను ప్రభుత్వం రద్దు చేసింది. కానీ, హిజాబ్‌ నిబంధనను మాత్రం అమల్లోనే ఉంచింది. ఈ క్రమంలో కొందరు మహిళలు హిజాబ్‌ ధరించకుండా బయటికి వస్తున్నారు.