New Delhi: దారుణం.. నడిరోడ్డు మీద యువతిపై దాడి చేసి, కారులోకి తోసిన యువకుడు.. వైరల్ వీడియో
వాయువ్య ఢిల్లీ ప్రాంతంలోని మంగోళ్ పురి ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన జరిగింది. రాత్రిపూట రోడ్డుపై ఒక యువకుడు యువతిపై దాడి చేశాడు. ఆమెను దారుణంగా కొడుతూ క్యాబ్‌లోకి తోసేశాడు. అనంతరం అతడు కూడా అదే కారులో ఎక్కాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా కారులో కూర్చున్నాడు.

New Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఒక యువకుడు, యువతిపై దాడి చేశాడు. ఆమెను బలవంతంగా కారులోకి తోశాడు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగినప్పటికీ ఎవరూ స్పందించకపోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.
New Delhi: బ్యాగులో మహిళ పుర్రె, శరీర భాగాలు లభ్యం.. మహిళను హత్య చేసి పడేశారా?
వాయువ్య ఢిల్లీ ప్రాంతంలోని మంగోళ్ పురి ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన జరిగింది. రాత్రిపూట రోడ్డుపై ఒక యువకుడు యువతిపై దాడి చేశాడు. ఆమెను దారుణంగా కొడుతూ క్యాబ్‌లోకి తోసేశాడు. అనంతరం అతడు కూడా అదే కారులో ఎక్కాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా కారులో కూర్చున్నాడు. ఇదంతా చుట్టుపక్కల వాళ్లు గమనిస్తున్నప్పటికీ, అమ్మాయిని రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే, ఎవరో ఈ ఘటనను వీడియో తీశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. నెంబర్ ఆధారంగా కారును గుర్తించారు. ఇది గురుగ్రామ్‌కు చెందిన కారుగా కనుగొన్నారు.
Ramgopal Reddy-MLC Elections 2023: ఉత్కంఠకు తెర.. రాంగోపాల్ రెడ్డికి కలెక్టర్ డిక్లరేషన్ అందజేత
ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి కలిసి ఉబర్ ద్వారా రోహిణి ప్రాంతం నుంచి వికాస్ పురి ప్రాంతానికి క్యాబ్ బుక్ చేసుకున్నట్లు తెలిసింది. కారు డ్రైవర్ ఇంటికి పోలీసుల్ని పంపించినట్లు డీసీపీ తెలిపారు. డ్రైవర్ ఇచ్చే సమాచారం ఆధారంగా నిందితుల్ని పట్టుకుంటామని, అమ్మాయిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హరేందర్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నామని ఆయన చెప్పారు.
#SOS | Just Now at Mangolpuri Flyover towards Peeragarhi Chowk.@DelhiPolice @LtGovDelhi @dcpouter @DCWDelhi @dtptraffic pic.twitter.com/ukmVc7Tu1v
— Office of Vishnu Joshi (@thevishnujoshi) March 18, 2023