New Delhi: బ్యాగులో మహిళ పుర్రె, శరీర భాగాలు లభ్యం.. మహిళను హత్య చేసి పడేశారా?

ఢిల్లీ పరిధిలోని రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టీఎస్) నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కూలీలు ఒక బ్యాగును గుర్తించారు. దుర్వాసన వస్తున్న ఈ బ్యాగు తెరిచి చూడగా అందులో ప్లాస్టిక్ కవర్లో చుట్టిన పుర్రె, వెంట్రుకలు, ఎముకలు, వేళ్లు, ఇతర శరీర భాగాలు కనిపించాయి.

New Delhi: బ్యాగులో మహిళ పుర్రె, శరీర భాగాలు లభ్యం.. మహిళను హత్య చేసి పడేశారా?

New Delhi: ఢిల్లీలో మరో దారుణ ఘటన జరిగింది. ఒక బ్యాగులో మహిళ పుర్రె, ఇతర శరీర భాగాలు లభ్యమయ్యయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ పరిధిలోని రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టీఎస్) నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కూలీలు ఒక బ్యాగును గుర్తించారు.

Ram Gopal Varma: పిచ్చోడు గెస్టా.. ఎంత అవమానం.. ఆర్జీవీని దేశం నుంచి బహిష్కరించాలి..

దుర్వాసన వస్తున్న ఈ బ్యాగు తెరిచి చూడగా అందులో ప్లాస్టిక్ కవర్లో చుట్టిన పుర్రె, వెంట్రుకలు, ఎముకలు, వేళ్లు, ఇతర శరీర భాగాలు కనిపించాయి. వెంటనే కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. శరీర భాగాల్ని పరీక్షల కోసం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు పంపించారు. ఫోరెన్సిక్ నిపుణులు వాటిని పరిశీలించి, సమాచారం అందిస్తారు. రాత్రిపూట ఆ బ్యాగ్ తీసుకొచ్చి పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమరాల్ని పరిశీలిస్తున్నారు. పుర్రె భాగం కుళ్లిపోయింది. మహిళను చాలా రోజుల క్రితమే నిందితుడు హత్య చేసి, శరీర భాగాల్ని వేర్వేరు చెట్ల పడేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Ramgopal Reddy-MLC Elections 2023: ఉత్కంఠకు తెర.. రాంగోపాల్ రెడ్డికి కలెక్టర్ డిక్లరేషన్ అందజేత

ఈ నెల 16న కూడా ఢిల్లీ పరిధిలోనే రెండు కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు పోలీసులకు లభ్యమయ్యాయి. దీంతో తాజాగా దొరికిన శరీర భాగాలు, గతంలో దొరికిన శరీర భాగాలు ఒక్కరివే అయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిన్నింటినీ సరిచూసేందుకు ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. హంతకులు మహిళ మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు చోట్ల పడేస్తుండొచ్చని పోలీసులు నమ్ముతున్నారు. దీనిపై విచారణ జరిపి విషయం నిగ్గు తేలుస్తామని పోలీసులు అంటున్నారు.