వావ్ ..అద్భుత దృశ్యం : సముద్రం నుంచి గాల్లోకి లేచిన నీరు సయ్యాట

  • Published By: veegamteam ,Published On : January 11, 2020 / 05:13 AM IST
వావ్ ..అద్భుత దృశ్యం : సముద్రం నుంచి గాల్లోకి లేచిన నీరు సయ్యాట

సాధారణంగా నీరు ఎత్తునుంచి పల్లానికి ప్రవహిస్తుంది. కొండలు..పర్వతాలపై కురిసిన నీరు కిందికే జారుతుంది. కానీ సముద్రం నుంచి నీరు పైకి ఎగసి గాలిలో సయ్యాట ఆడని అరుదైన..అద్భుతమైన దృశ్యాన్ని చూశారా..ఈ అద్భుతమైన సుందర దృశ్యం డెన్మార్క్‌లోని ఫారో ఐలాండ్స్‌లో కనువిందు చేసింది. 

సముద్రపు అలల నుంచి నీరు ఎత్తుగా ఉన్న కొండపైకి ఎదురు ప్రవహించింది. గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా పనిచేసిన ఈ దృశ్యాన్ని జాకొబ్సేన్‌ అనే వ్యక్తి జనవరి 6న  తన కెమెరాలో బంధించాడు. ఆ ప్రాంతంలో ఉండే గాలి ఒత్తిడి వల్ల ఇలా జరిగినట్లుగా తెలుస్తోంది.  సోమవారం కెమెరాలో బంధించాడు. సుడిగాలితో పాటు కొండ అంచులకు చేరుతున్న నీటి ప్రవాహపు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ అద్భతమైన దృశ్ం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ అరుదైన దృశ్యంపై వాతావరణ నిపుణులు ఇలా అన్నారు…టోర్నడోలు ఏర్పడే క్రమంలో నలువైపులా ఒత్తిడికి గురైన గాలి భూమిపై ఉన్న చెత్త చెదారంతో గొట్టంలా మారి విధ్వంసం సృష్టిస్తుంది. నీరు చాలా ఫాస్ట్ గా కదులుతుందనీ..ఒక్కోసారి దాని ఒత్తిడి నీరు మేఘాలను తాకేటంత ఎత్తులో కూడా ఉంటుందని తెలిపారు. ఈ ఘటన కూడా అటువంటిదేనంటున్నారు.