బ్యాట్ అంత లేడు : బుడతడి క్రికెట్ షాట్లు చూడండీ 

  • Published By: veegamteam ,Published On : November 11, 2019 / 11:19 AM IST
బ్యాట్ అంత లేడు : బుడతడి క్రికెట్ షాట్లు చూడండీ 

క్రికెట్ చిన్నారుల నుంచి పెద్ద వారికి వరకూ ఎంతో ఇష్టపడే ఆట. చిన్నపిల్లలు కూడా బుడ్డి బుడ్డి బ్యాట్లు పట్టుకుని ఆడేస్తుంటారు. ఇదిగో ఈ బుడతడి క్రికెట్ ఆట చూస్తే స్టార్ క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోతారు. పిట్ట కొంచెం కూత ఘనం అంటామే అచ్చంగా అలానే ఉంది ఈ బుడ్డోడి ఆట. క్రికెట్ షాట్లతో అద్దరగొట్టేస్తున్నాడు.

అద్భుతమైన, స్టయిలిష్ షాట్లతో ఔరా..బ్యాట్ అంత లేడు ఈ షాట్లు ఏంటిరా బాబూ అనుకోక తప్పదు. డైపర్లు వేసుకుని మరీ క్రికెట్ బాల్ ను ఎగరగొట్టేస్తున్నాడు.  ఈ పిలగాడి క్రికెట్ షాట్ల వీడియోను ప్రముఖ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. 

అందులో ఆ బాలుడు డైపర్ వేసుకుని ప్రొఫెషనల్ క్రికెటర్ల మాదిరిగా అద్భుతమైన కవర్ డ్రైవ్స్, ఫ్రంట్ ఫుట్, లాఫ్టెడ్ షాట్లు ఆడుతుండటం అబ్బురపరుస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన మైకేల్ వాన్ దానికి ‘Surely he has an English cat or dog’ అని కామెంట్ కూడా పెట్టాడు. ఈ బుడతడి క్రికెట్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వైరల్ గా మారింది.