క్రీడలు

ఢిల్లీ : ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది.  రెజ్లింగ్‌ 65 కేజీల పురుషుల విభాగంలో భజరంగ్‌ పునియా సత్తాచాటి భారత్‌కు పసిడి పతకం అందించాడు. జపాన్‌కు చెందిన డాచీ తకాటాపై 11-8 తేడాతో పునియా ఘన విజయం సాధించాడు.

ఇండోనేషియా : జకర్తా వేదికగా ఏసియాడ్‌ గేమ్స్‌ ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడా సమరానికి ఇండోనేషియా రెండోసారి ఆతిథ్యమిస్తోంది. 16 రోజుల పాటు ఈ మెగా క్రీడా సంబరాలు జరగనున్నాయి. మొత్తం 45 దేశాల నుండి 11వేల మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు.

ఇండోనేషియా : జకర్తా వేదికగా 18వ ఏసియాడ్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. ఇండోనేషియా రెండోసారి ఏసియాడ్ గేమ్స్ కు అతిథ్యమిస్తోంది. 16 రోజులు పాటు ఏసియాడ్ గేమ్స్ జరుగనున్నాయి. 45 దేశాల నుండి 11 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 572 మంది అథ్లెట్లతో భారీ అంచనాలతో భారత్ బరిలోకి దిగనుంది.

సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెటర్ దిగ్గజాల్లో ఒకరు. కేవలం 16 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ లో అడుగు పెట్టి సెంచరీల రారాజుగా పేరు తెచ్చుకుని మాస్టర్ బ్లాస్టర్ గా పేరొందాడు. ఇప్పుడు ఆయన కుమారుడు అర్జున్ కూడా క్రికెట్ లో రాణిస్తున్నాడు.

ఢిల్లీ : భారత మాజీ టెస్ట్‌ కెప్టెన్‌ , చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ వాడేకర్‌ కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని జస్‌లోక్‌ ఆస్పత్రిలో రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

లండన్ : క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో విజయం సాధించాలనుకున్న కోహ్లీసేన పరాజయంపాలైంది. 159 పరుగుల ఇన్సింగ్స్‌ తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లాండ్‌  2-0తో  ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్యాట్స్‌మెన్స్‌ వైఫల్యం కారణంగా..

హైదరాబాద్ : ప్రముఖ షట్లర్ పీవీ సింధు ఆదివారం లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మహంకాళీ అమ్మవారికి మారు బోనం సమర్పించారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం సింధు మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ త్వరలో బీసీసీఐ ప్రెసిడెంట్‌ కానున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్‌ వర్గాలు. బీసీసీఐ కొత్త రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ఆమోదించటంతో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

ఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ లో పీవీ సింధు పోరాడి ఓడింది. 21..19, 21..10 తేడాతో పీవీ సింధుపై కరోలినా మారిన్‌ విజయం సాధించింది. సింధు వరుసగా రెండోసారీ రజత పతకానికే పరిమితమైంది. కరోలినాతో ఆడిన 12 మ్యాచ్‌ల్లో  ఐదు మ్యాచ్‌ల్లో సింధు విజయం సాధించింది. 

ఢిల్లీ : ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం లక్ష్య సేన్‌ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో జరిగిన ఫైనల్‌ పోరులో లక్ష్యసేన్‌ 21-19, 21-18 తేడాతో థాయ్‌లాండ్‌ ఆటగాడు కున్‌లవుత్‌ పై విజయం సాధించి చాంపియన్‌గా నిలిచాడు.

Pages

Don't Miss