Ipl 2024 : మారని ముంబై.. ఖాతాలో మరో ఓటమి
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లతో చెలరేగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 169 పరుగులు చేసింది.

Kkr Vs Mi Ipl 2024 (Photo Credit : Google)
IPL 2024 : ముంబై ఇండియన్స్ తీరు మారలేదు. వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. ముంబై ఖాతాలో మరో ఓటమి చేరింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో ముంబై పరాజయం పాలైంది. 170 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై జట్టులో.. సూర్యకుమార్ (56) మినహా మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. దాంతో 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లతో చెలరేగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 169 పరుగులు చేసింది.
Also Read : మీడియా సమావేశం అనంతరం నేరుగా రింకూసింగ్ వద్దకు వెళ్లిన రోహిత్ శర్మ..