bathukamma

09:57 - September 29, 2017

పశ్చిమగోదావరి : తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లోనూ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని రాఘవాపురం, ఎండపల్లి, మల్లేశ్వరం గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడి మహిళలు 11 ఏళ్లుగా బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నారు. గ్రామ దేవత మరిడమ్మ ఆలయం వద్ద బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ ఆడటం ఎంతో ఆనందంగా ఉందని స్థానిక మహిళలు అంటున్నారు. 

09:47 - September 29, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండిలోని శ్రీనివాసనగర్‌ కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో 12 అడుగులు బతుకమ్మను ఏర్పాటు చేశారు. కాలనీలోని మహిళలంతా దాని చుట్టూచేరి బతుకమ్మ ఆడారు. దాండియా ఆటలాడుతూ అర్థరాత్రి వరకు సంబరాలు చేసుకున్నారు. వర్షంపడుతున్నా సద్దుల బతుకమ్మ ఆడుతూ సంతోషంగా గడిపారు. మహిళలు, యువతులు రంగురంగుపూలతో బతుకమ్మలను పేర్చి వాటిచుట్టూరా బతుకమ్మ ఆడిపాడారు.  

08:10 - September 29, 2017

ప్రభుత్వం గిన్నీస్ బుక్ రికార్డ్ కోసమే అని, బతుకమ్మ అంటే బతునిచ్చే అమ్మ అని, బతుకమ్మ సంస్కృతిక ఉత్సవమని, బతుకమ్మ తో ఆడబిడ్డల అభివృద్ది కృషి చేయాలని, టీఆర్ఎస్ బతుకమ్మను ప్రచారం తప్ప సంస్కృతింగా చేయలేదని, పెళ్లైనా మహిళలకు టీఎస్ పీఎస్ సీ తండ్రి పేరుపై ఆదాయం సర్టిఫికేట్ తీసుకురావాలని షరుతులు విధించడం, తెలంగాణ ఉద్యమం కోసం బతుకమ్మను ఉపయోగించుకున్నారని నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య అన్నారు. ఏ రాష్ట్రం ఏర్పాడిన సంస్కృతికంగా ఏర్పడుతోందని, మహిళ గురించి ప్రభుత్వం గొప్పలు చెబుతుందని, కేబినెట్ లో ఒక మహిళకు చోటు కల్పించలేదని, ఆనాడు నైజంలపై బతుకమ్మ ఆడుతూ పోరాటం చేశామని, ప్రజల యొక్క ఆశలపై ప్రభుత్వం మైండ్ గేమ్ అడుతున్నారని కాంగ్రెస్ నేత కైలాష్ అన్నారు. బతుకమ్మ మన బతుకు చిత్రన్ని అవిష్కరిస్తాయని, తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మలో మమేకం అయిందని, మహిళ పట్ల వివక్ష లేదని, వారికి కోసం కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ స్కీంలు ప్రవేశాపెట్టాయిని టీఆర్ఎస్ నేత సత్యనారాయణ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:08 - September 29, 2017

హైదరాబాద్ : ఇంతకీ ఎవరీ బతుకమ్మ...? ఆమె పేరిట తెలంగాణ యావత్తు ఎందుకు పండుగ చేసుకుంటుంది..? ఈ ప్రశ్నకు తెలంగాణ పల్లెసీమల్లో రకరకాల సమాధానాలు వినిపిస్తాయి. భూస్వామి అఘాయిత్యానికి బలైన బాలికను తమ స్మృతిపథంలో కలకాలం బతికుండమని దీవిస్తూ జరుపుకునే పండుగ అని ఓ కథనం.. చోళులకు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలిగిన కుమార్తెను కష్టాల నుంచి బయట పడేసేందుకు బతుకమ్మగా పేరు మార్చగా ఆమె సౌభాగ్యవతి అయిందని.. అదే భాగ్యం తమకూ కలగాలని కోరుతూ మహిళలు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారన్న మరో కథనం ప్రచారంలో ఉన్నాయి. 

08:07 - September 29, 2017

హైదరాబాద్ : తెలంగాణ పల్లెసీమల్లో దసరా అంటే బతుకమ్మే. బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతే కాదు.. ఈ నేలపై పుట్టిన ఆడపడుచుల సృజనాత్మక శక్తికీ నిదర్శనం. తెలంగాణ మహిళల చేతులు పడగానే సుమనోహర సుమాలు సైతం అద్భుత ఆకృతులను సంతరించుకుంటాయి. నవ నాగరికతకు ఆద్యులమని భావించే వారిని సైతం తెలంగాణ ఆడబిడ్డల కళాత్మకత కట్టిపడేస్తుంది. తెలంగాణ ప్రకృతి సోయగాలకు నెలవు... అందునా శీతాకాలపు తొలి నాళ్లలో విరబూసిన పుష్ప శోభతో... ఈ నేల మరింత రమణీయంగా భాసిల్లుతుంది. ఇక్కడ ఊపిరులు పోసుకున్న వారు, ప్రకృతిని అమితంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా ఈ నేలపై పుట్టిన ఆడపడుచులు ప్రతి సంబరానికీ ప్రకృతినే ఆలంబనగా చేసుకుంటారు. అందుకే ఇక్కడి పర్వదినాల్లో ఎక్కువ శాతం ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనది బతుకమ్మ.

08:06 - September 29, 2017

హైదరాబాద్ : తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు జరిగిన బతుకమ్మ సంబురాలు ఘనంగా ముగిశాయి. ఈనెల 20న ఎంగిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. ఈ తొమ్మిది రోజులు రకరకాల బతుకమ్మను పూజించారు.మొదటి రోజు ఎంగిపూల బతుకమ్మ, రెండో రోడు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాల్గవ రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ జరుపుకున్నారు. ఆరోజు బతుకమ్మ అలిగివెళ్లడంతో పెద్దగా ఉత్సవాలు నిర్వహించకపోడం ఆనవాయితీగా వస్తోంది. ఏడువ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ నిర్వహించిన తెలంగాణ మహిళలు, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. చెరువులు, కాల్వల్లో బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చారు.

చెరువుల్లో నిమజ్జనం...
సిద్దిపేట జిల్లా కోమటి చెరువు వద్ద జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. హాస్య నటులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆడపడులు ఆట, పాటలతో సంబరాలు అంబరాన్ని అంటాయి. పోయిరా గౌరమ్మ, మళ్లీరా బతుకమ్మ అంటూ బతుకమ్మలకు కాల్వలు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. :ఉమ్మడి నల్గొండ జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడకలు ఘనంగా జరిగాయి. నల్గొండ వల్లభరావు చెరువు, సూర్యాపేట సద్దెల చెరువు, భువనగిరి జూనియర్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వర్షంలోనే బతుకమ్మ ఆడి, పాడారు.

మనువరాలుతో ఎమ్మెల్యే కొండా సురేఖ
మెదక్‌ జిల్లా వేముల ఘాట్‌లో సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. వర్షంలోనే మహిళలు బతుకమ్మలను పూజించి, ఆడి, పాడారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందు మండల కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్యే హనుమంతు షిండే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జుక్కల్‌ మండలంలో కూడా బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. రంగల్‌ అర్బన్‌ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కొత్తవాడలో నిర్వహించిన బతుకమ్మ వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ తన మనువరాలుతో కలిసి బతుకమ్మ ఆడారు. కరీమాబాద్‌ రంగ సముద్రంతోపాటు కాశిబుగ్గ, చిన్నవడ్డేపల్లి చెరువల వద్ద బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. బతుకమ్మ ఆడిపాడిన అనంతరం గంగమ్మ చెంతకు చేర్చారు.

బతుకమ్మ వేడుకల్లో విషాదం
నాగర్‌ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, ప్రజలు కలిసి బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకృతి పూల పండుగ బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆట, పాటలతో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు అలరించాయి. జనగామ జిల్లా కలెక్టర్‌ దేవసేన, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య తలెత్తిన వివాదం బతుకమ్మ వేడుకల్లో కూడా కనిపించింది. కలెక్టర్‌ దేవసేన, ఎమ్మెల్య ముత్తిరెడ్డి వేర్వేరుగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. దేవసేన బాణాపురంలోని వెంకటేశ్వరాలయంలో బతుకమ్మ నిర్వహించగా, ముత్తిరెడ్డి బతుకమ్మ కుంటలో సంతంగా ఏర్పాటు చేశారు. దీంతో సద్దుల బతుకమ్మ ఎక్కడ ఆడాలతో తెలియక మహిళలు ఆయోమయానికి గురయ్యారు. మరోవైపు మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం ఇందుపల్లిలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. పూలు కోసేందుకు చెరువులో దిగిన లింగన్న మృతి చెందాడు. దీంతో లింగన్న కుటుంబంలో విషాదం నెలకొంది. మృతులు నిరుపేద కావడంతో గ్రామస్తులు చందాలు వేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. 

08:04 - September 29, 2017

హైదరాబాద్ : శ్రీరాంనగర్‌లో బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు ఎం శ్రీనివాస్‌తోపాటు కాలనీ సంక్షేమ సంఘం ఉత్సవాలకు హాజరయ్యారు. వర్షంలో కూడా మహిళలు, పిల్లలు బతుకమ్మ ఆడి సందడి చేశారు. 

13:36 - September 28, 2017

హైదరాబాద్ : విద్యానగర్‌ ఆంధ్రాబ్యాంక్‌ బ్రాంచ్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బ్యాంక్‌ ఉద్యోగులు, తమ కస్టమర్లతో కలిసి బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం తమ బ్యాంక్‌లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటామని ఈ సంవత్సరం కూడా కస్టమర్లతో కలిసి వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని బ్యాంక్‌ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.

13:23 - September 28, 2017
11:23 - September 28, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - bathukamma