Top Headlines : తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారన్న చంద్రబాబు

ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడ్డారని ఆయన విమర్శించారు.

Top Headlines : తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారన్న చంద్రబాబు

తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ
తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. మున్సిపల్‌ కార్యదర్శిగా దానకిశోర్‌ కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఆ స్థానంలో ఉన్న అర్వింద్‌కుమార్‌కు స్థానచలనం అయింది.

సీపీ వార్నింగ్‌
రెండు నెలల్లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు. డ్రగ్స్ విషయంలో ఎంతటివారినైనా వదిలిపెట్టే సమస్యే లేదని ఆయన తేల్చి చెప్పారు.

మాదీ గ్యారంటీ
ఆరు నూరైనా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ పథకాల అమలు విషయంలో ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండవని అన్నారు.

సర్కార్‌పై ఫైర్‌
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ నిర్ణయాలతో రైతులు రోడ్డున పడ్డారని ఆయన విమర్శించారు.

కలిసి మెలిసి
బీజేపీ తమతో కలిసి రావాలని కోరుకుంటున్నా జనసేన బలోపేతమే తమ లక్ష్యమని నాగబాబు అన్నారు. వాస్తవానికి ఈ రెండు పార్టీల మధ్య గతంలో దీర్ఘకాలిక పొత్తు కనసాగింది. కానీ కొంత కాలం క్రితం తెలుగుదేశంతో పవన్ పొత్తు ప్రకటించినప్పటికీ నుంచి ఇరు పార్టీల మధ్య అంత సఖ్యత కనిపించడం లేదు.

టార్గెట్‌ బీఆర్‌ఎస్‌ ..
BRS నేతలు అధికారంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ MLC జీవన్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు చేశారు. కాళేశ్వరం అవినీతిని బయటపెడతామని తెలిపారు.

చంద్రబాబు విజ్ఞప్తి…
కుప్పంలో ఏనుగుల సంచారంపై కలెక్టర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ఏనుగుల దాడి నుంచి ప్రజల్ని కాపాడాలంటూ, ఆమేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.

మీ ఆడబిడ్డనే..
ఏ స్థాయిలో ఉన్నా ములుగుకు ఆడబిడ్డనే అని మంత్రి సీతక్క అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చేస్తానని చెప్పారు. ఆదివారం మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటించారు. మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షించారు.

కల్తీగాళ్లు ..
యాదాద్రి జిల్లాలో కల్తీ పాల తయారీ గుట్టురట్టు అయింది. పోచంపల్లి మండలంలో నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

పదవుల పందేరం ..
రేపు గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పీఏసీ సమావేశం జరగనుంది. నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉంది.

డైమండ్స్‌ బోర్స్ భవనం ప్రారంభం..
సూరత్‌ డైమండ్స్‌ బోర్స్‌ భవన సముదాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాలను నిర్మించారు. 65వేల మంది వ్యాపారం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా దీన్ని పేర్కొంటున్నారు.

ప్రాజెక్టుపై రివ్యూ..
కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ పిల్లర్ల అంశంపై ఈఎన్సీ మురళీధర్, అధికారులతో చర్చించారు.

సముద్రంలో గల్లంతు..
మచిలీపట్నం బీచ్‌లో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతు అయ్యారు. నలుగురిని పోలీసులు రక్షించారు.. మరొకరికోసం ఆచూకీకోసం గాలింపు కొనసాగుతుంది.

తుమ్మల ఆగ్రహం
భద్రాచలంలో వంతెన పనులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పరిశీలించారు. ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంపై కాంట్రాక్టర్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వామియే శరణం ..
శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దర్శనం కోసం భక్తులు పడిగాపులు కాస్తున్నారు. ఆలయం వద్ద సరైన ఏర్పాట్లు చేయడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎలా ముందుకెళ్దాం..!
జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌తో RBI మాజీ గవర్నర్ రఘురాంరాజన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు ఉన్నారు.

కొత్త బాధ్యతలు..
కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని చాంబర్‌లో ప్రత్యేక పూజలు అనంతరం బాధ్యతలు స్వీకరించారు.

మావోయిస్టుల బరితెగింపు..
ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో మావోయిస్టులు బరితెగించారు. జవాన్లపై కాల్పులు జరిపారు. మావోలో కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యారు.

పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌
దుండిగల్‌లో ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో కంబైండ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్నక్యాడెట్లు మీరు ఆఫీసర్లుగా రావడం సంతోషంగా ఉందన్నారు. మీపైన మరింత బాధ్యత పెరుగుతుందని, దేశ గౌరవం, దేశ భద్రత మీపైనా ఉంటుందని తెలిపారు.

దొంగల బీభత్సం..
శంషాబాద్ మండలంలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. స్కూటీపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వాహనాన్ని ఆపి కత్తులతో బెదిరించి 1,50,000 నగదు ఎత్తుకెళ్లారు. శంషాబాద్ మండలం గొల్లూర్ ఎక్స్ రోడ్ వద్ద ఘటన
జరిగింది.

కుట్ర భగ్నం..
జమ్మూకశ్మీర్‌లో ఆయుధాల డంప్‌ బయటపడింది. బాంబులు, తూటాలను ఆర్మీ స్వాధీనం చేసుకుంది.

డ్రైవర్ రమేష్, రాములు ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముర్ము టూర్ ..
రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. 20న భూదాన్‌ పోచంపల్లిలో పర్యటించనున్నారు.

కారు బీభత్సం ..
ఎల్బీనగర్ చింతలకుంటలో కారు బీభత్సం సృష్టించింది. పలు వాహనాలకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదం..
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కురుగుంట దగ్గర లారీని ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరొకరికి గాయాలు అయ్యాయి.

నేడు తొలి వన్డే..
నేడు భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. జోహన్నెస్ బర్గ్ వేదికమధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

వందే భారత్ రైలులో రోజా..
గుంటూరు నుండి తిరుపతికి వందే భారత్‌ రైలులో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి రోజా శనివారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా రోజు మాట్లాడుతూ … వందేభారత్‌ ట్రైన్‌ చాలా శుభ్రంగా బాగుందని అన్నారు. ఈ ట్రైన్‌ లో ప్రయాణించడం వల్ల గమ్యాన్ని చాలా తొందరగా సేఫ్‌ గా చేరుకోవచ్చని అన్నారు.

వైకుంఠ ద్వారదర్శనం ..
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠద్వారం గుండా భక్తులకు దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించనున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ లో దర్శన టికెట్లను టీటీడీ జారీ చేసింది. ఆఫ్ లైన్ లో ఈనెల 22న తిరుపతిలో టికెట్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

స్టాఫ్ నర్సుల పోస్టులు ..
తెలంగాణ మరో 1890 స్టాప్ నర్స్ ల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్ 30న 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా.. దానికి మరో 1890 పోస్టులను కలిపి మొత్తం 7,094 పోస్టులను రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి ద్వారా భర్తీ చేసేందుకు అనుమతినిచ్చింది.

పేలిన గ్యాస్ సిలిండర్ ..
నిర్మల్ జిల్లా బైంసా మండలం కమోల్ లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మహిళ సజీవదహనం కాగా.. ఇల్లు పూర్తిగా దగ్దమైంది. గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

పెరుగుతున్న చలి..
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో చలితీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలను చలి వణికిస్తుంది.