Bathukamma 2023 : పూల వేడుకలో ఐదో రోజు అట్ల బతుకమ్మ .. నైవేద్యాల ప్రత్యేకత ఇదే

బతుకమ్మ వేడుకలలో తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను కొలుచుకునే ఆడబిడ్డలు ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. పసుపు, కుంకుమలతో సౌభాగ్యవతులుగా జీవించాలని కోరుకుంటారు. తమ ఇల్లు పాడి పంటలతో వర్ధిల్లాలని గౌరమ్మను వేడుకుంటారు.

Bathukamma 2023 : పూల వేడుకలో ఐదో రోజు అట్ల బతుకమ్మ .. నైవేద్యాల ప్రత్యేకత ఇదే

Bathukamma

Bathukamma 2023 5th day  : బతుకమ్మ..బతుకు అమ్మా అని ఆడబిడ్డలను దీవించే పండుగ. తెలంగాణ సాంస్కృతిక వైభవాల పండుగ బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగ వెనుక ఎన్ని కథలు ఉన్నా ఈ పండుగలో ప్రధానమైన పాత్రను వహించేవి పూలే. పువ్వుల సంబురాల పండుగలో అప్పుడే నాలుగు రోజులు పూర్తయ్యాయి. ఈరోజు ఐదో రోజు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో పూజించే బతుకమ్మ పండుగలో ఐదో రోజు అట్ల బతుకమ్మ పండుగ.

మానవ జీవితానికి ప్రకృతితో పెనవేసుకున్న బంధమైన ఈ బతుకమ్మ పండుగలో ఎన్నో రకాల పూలు మమేకమైపోతాయి. వాటి వాటి పుట్టుకను సార్ధకం చేసుకుంటాయి. ప్రతీ సంవత్సరం తెలంగాణలో జరుపుకునే ఈ పండుగ రాష్ట్ర వ్యాప్తంగానేకాదు ప్రపంచంలో ఎక్కడ తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నా ఈ పండుగను జరుపుకోకుండా ఉండలేరు. ఆడబిడ్డల జీవితాల్లో బతుకమ్మ అంతాగా పెనవేసుకుపోయింది. ప్రకృతి పండుగ.. ఆడబిడ్డల బతుకమ్మగా జరుపుకునే ఈ పండుగలో ఐదో రోజు అట్ల బతుకమ్మగా జరుపుకుంటారు.

Dussehra 2023: దసర పండుగ రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు..? విజయాలకు జమ్మిచెట్టుకు ఉన్న సంబంధమేంటి…?

బతుకమ్మ వేడుకలలో తొమ్మిది రోజులు రకరకాలుగా గౌరమ్మను కొలుచుకునే ఆడబిడ్డలు ఒక్కో రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. పసుపు, కుంకుమలతో సౌభాగ్యవతులుగా జీవించాలని కోరుకుంటారు. తమ ఇల్లు పాడి పంటలతో వర్ధిల్లాలని గౌరమ్మను వేడుకుంటారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. దీంట్లో భాగంగా ఐదో రోజు అట్ల బతుకమ్మను మహిళలు ఘనంగా జరుపుకుంటారు. ఈ అట్ల బతుకమ్మ రోజున బియ్యంతో చేసిన అట్లు, దోశలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.

నానబెట్టి బెట్టిన బియ్యాన్ని దంచి లేదా మర పట్టించి పిండిగా చేసి అట్లవేస్తారు. ఈ అట్లను గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ అట్లను ముతైదువులకు వాయనంగా అందిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ రోజున కూడా ప్రతీ రోజు వలెనే తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు, చామంతి పూలు, మందారం, గుమ్మడి, తామర వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి సాయంత్రం సమయంలో అందరు ఒకచోట చేరి ఆడి పాడతారు.