తెలంగాణ

మహబూబ్ నగర్ : ప్రశాంతంగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై దాడి జరిగింది.

హైదరాబాద్: డిసెంబర్ 7న దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

వరంగల్ : జిల్లా అసెంబ్లీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ఓటర్లు బారులు తీరుతున్నారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ఓట్లు వేయటనికి సాధారణ ప్రజానీకంతో పాటు ప్రముఖులు కూడా క్యూలలో నిలబడి ఓటు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జోరుగా కొనసాగుతున్నది.

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. కొన్ని పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించటంతో ఆలస్యంగా ప్రారంభం అయ్యింది ఓటింగ్. ప్రముఖులు అందరూ ఉదయం 7 గంటల నుంచే బూతులకు తరలివచ్చారు. 10 గంటలలోపు చాలా మంది రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు టాలీవుడ్ స్టార్స్ తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు.

నల్గొండ : ఓటు వేస్తే...ఒక స్వీటు..ఒక పువ్వు..అవును..నిజం బోయవాడ..రామగిరిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు వేయడానికి వచ్చిన వారికి అధికారులు వాటిని అందిస్తున్నారు.

హైదరాబాద్ : పోలింగ్ సమయంలో కొంతమంది ఓట్లు గల్లంతు కావటం సర్వసాధారణం. డిసెంబర్ 7న తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న క్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు ఓటర్ల జాబితాలో గల్లంతైంది.

హైదరాబాద్: పోలింగ్ కేంద్రంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావుకి చేదు అనుభవం ఎదురైంది. ఓటర్ల నుంచి ఆయనకు అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో ఓటు వేయకుండానే ఆయన వెనక్కివెళ్లిపోయారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం మొదటి సారిగా జరుగుతున్న ఎన్నికలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఉదయం నుండే కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు.

Pages

Don't Miss