Kompella Madhavi Latha : ఓల్డ్ సిటీలో ఈసారి రిగ్గింగ్ చేయనివ్వం, హిందువులు ధైర్యంగా ఓటేయండి- మాధవీ లత

బీజేపీపై విమర్శలు చేస్తున్న వారందరూ పని పాట లేనివారే. అర్థం లేని విమర్శలు చేస్తున్నారు.

Kompella Madhavi Latha : ఓల్డ్ సిటీలో ఈసారి రిగ్గింగ్ చేయనివ్వం, హిందువులు ధైర్యంగా ఓటేయండి- మాధవీ లత

Kompella Madhavi Latha (Photo Credit : Facebook)

Updated On : May 4, 2024 / 11:50 PM IST

Kompella Madhavi Latha : ఎంఐఎంపై మండిపడ్డారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ మాధవీ లత. మతాన్ని రెచ్చగొడుతున్నది తాము కాదని, అసదుద్దీన్ ఓవైసీ అని ఆమె ఎదురుదాడి చేశారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో బీజేపీ అద్భుతమైన విజయం సాధిస్తుందని మాధవీలత విశ్వాసం వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీలో రిగ్గింగ్ చేయనివ్వం అని చెప్పారామె. ముస్లిం, హిందూ సోదరులు అందరూ ధైర్యంగా ఓటేయండి అని పిలుపునిచ్చారు.

పాతబస్తీలో వెధవ వేషాలు వేసే వారికి తగిన శాస్తి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు మాధవీలత. ఎంఐఎంకు ముందుంది మొసళ్ల పండుగ అని అన్నారు. ”లేని బాణాలను మసీదుపై వేసింది ఎవరు? ఇంతకు బాణాలు వేసింది ఎవరు? ఓవైసీ చూశారా..? ప్రేమ, అభిమానం, సాహసం, విజయం.. అన్నీ బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి.

బీజేపీపై విమర్శలు చేస్తున్న వారందరూ పని పాట లేనివారే. అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లు హిందూ దేవుళ్లను తిట్టిన వారే విమర్శలు చేస్తున్నారు. పురోహితులతో కండువాలు వేయించుకుంటున్నారు” అని మండిపడ్డారు మాధవీలత.

Also Read : రేవంత్ సర్కారుని పడగొడతామన్న వారే పడిపోతారు: అసదుద్దీన్ కీలక కామెంట్స్