రీషూట్లతో స్లోగా సాగుతోన్న సైరా షూటింగ్!

మెగాస్టార్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సైరా సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు టాలివుడ్ లో వరుస హిట్స్ కొడుతోన్న స్టార్ డైరెక్టర్ కూడా కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నాడు. మరి ఆ డైరెక్టర్ కి సైరాకి ఉన్న లింకేంటి..? ఇంతకీ సైరా ఎప్పటికి పూర్తవుతుంది..?
భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల ఏడాది నుంచి ఖాళీగానే ఉన్నాడు. మెగాస్టార్ ఎప్పుడెప్పుడు ఫ్రీ అవుతాడా అని ఎదురుచూస్తున్నాడు. మధ్యలో ఇతర హీరోలతో సినిమా చేసే ఛాన్సు చిరంజీవితోనే సినిమా చేయాలని పట్టుబట్టి కూర్చున్నాడు. చిరూ కోసం కొరటాల మరోసారి సోషల్ మెసేజ్ తో కూడిన ఓ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసినట్లు సమాచారం. కానీ సైరా ఓ పట్టాన పూర్తకాకపోవడమే కొరటాలని టెన్షన్ పెడుతోంది. సైరా పూర్తయితే కానీ మెగాస్టార్ తో కొరటాల సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేదు. మే ఎండింగ్ కి సైరా షూటింగ్ కంప్లీట్ ఐతే మధ్యలో రెండు నెలలు గ్యాప్ ఇచ్చి ఆగష్టులో సినిమాని మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం-కోట్లలో నష్టం
200 కోట్లకిపైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మొదలవ్వడమే ఆలస్యంగా మొదలైన సైరా షూటింగ్ ప్రస్తుతం ఓ పట్టాన ముందుకుసాగడం లేదు. రీషూట్లు షూటింగ్ వాయిదాలతో 2017లో స్టార్టైన సినిమా ఇంకా పూర్తవ్వలేదు.
మేజర్ టాకీ పార్ట్ పూర్తైనప్పటికీ ఇంకా ప్యాచ్ వర్క్ మిగిలుడటంతో షూటింగ్ ని పొడగించారు. ప్రస్తుతం కోకాపేట్, దండు మైలారం, వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పార్ట్ దాదాపుగా చివరి దశకు చేరుకోవడంతో ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ గా జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.
Also Read : వైరల్ అవుతున్న మీరా జాస్మిన్ ఫోటోలు