శేఖర్ కమ్ముల న్యూ మూవీ అప్‌డేట్!
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రాలని అందంగా తెరకెక్కించగల ప్రముఖ దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు.

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రాలని అందంగా తెరకెక్కించగల ప్రముఖ దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు.
యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రాలను అందంగా తెరకెక్కించగల ప్రముఖ దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ‘ఫిదా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుని ప్రేక్షకులని అలరించిన శేఖర్ కమ్ముల తన తర్వాత ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ఏషియన్ సునీల్ నిర్మాణంలో ఒక సినిమాను చేస్తున్నట్లు తెలిపిన శేఖర్ కమ్ముల ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా సన్నాహాలు చేసుకుంటున్నాడని సమాచారం.
డాన్స్ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమా కోసం కొత్త వారిని ఎంపిక చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఎప్పుడు వెల్లడిస్తాడో ఏంటో. అసలు సోషల్ మీడియా ఇంత పెరిగిన ఈ సినిమాకు సంబంధించి చిన్న విషయం కూడా బయటకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి శేఖర్ కమ్ముల సైలెంట్ గా సక్సెస్ ను కొట్టేస్తాడేమో చూడాలి.
Also Read : పూరీ.. ఐ యామ్ సారీ : మహేష్ ట్వీట్