Sai Dharam Tej: రిపబ్లిక్.. ఫస్ట్ లుక్ అదరిందిగా..
Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోండగా.. రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్గా ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను హీరో రామ్ చరణ్ విడుదల చేయగా.. ‘డెబ్బై నాలుగేళ్లుగా ప్రభుత్వం ఉందనే భ్రమల్లో మనం బతుకుతున్నాం. కానీ, మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు’ అని పైన రాసి ఉండగా.. కింద సాయిధరమ్ తేజ్ లుక్ ఉంది. ఈ సినిమాలో ప్రస్తుత రాజకీయాలను చర్చించనుండగా.. ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.
Loved the poster!
Wishing my dear brother @IamSaiDharamTej , director @devakatta & the entire team … All the best!!#Republic#RepublicFirstLook#RepublicOnJune4th pic.twitter.com/wRsaCoPT3s— Ram Charan (@AlwaysRamCharan) March 25, 2021
అంతకుముందు టైటిల్‌కు సంబంధించి మోషన్ పోస్టర్ విడుదల చేయగా.. అందులో.. యువరానర్.. ప్రజలు ఎన్నుకున్ను రాజకీయ నాయకులు, శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్’ అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇప్పుడు అదేమాదిరిగా కొత్త లుక్ కూడా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఈ సినిమాను జూన్ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. .
Here’s revealing the First Look of ‘ABHI’ and his perspective from #REPUBLIC.#RepublicFirstLook #RepublicOnJune4th @IamSaiDharamTej @devakatta @aishu_dil @IamJagguBhai @meramyakrishnan #ManiSharma @mynnasukumar @bkrsatish@JBhagavan1 @Cinemainmygenes @JBEnt_Offl @ZeeStudios_ pic.twitter.com/4x1fAsPJsV
— BARaju (@baraju_SuperHit) March 25, 2021