ఏమయ్యాడు : ఇంకా దొరకని బీజేపీ జిల్లా అధ్యక్షుడి కుమారుడి ఆచూకీ
ఖమ్మం జిల్లా వాసి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నే ఉదయ్ ప్రతాప్ ఏకైక కుమారుడు ఉజ్వల్ శ్రీహర్ష ఆచూకీ ఇంకా తెలియలేదు. అదృశ్యమై రెండు రోజులవుతున్నా ఇంకా శ్రీహర్ష

ఖమ్మం జిల్లా వాసి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నే ఉదయ్ ప్రతాప్ ఏకైక కుమారుడు ఉజ్వల్ శ్రీహర్ష ఆచూకీ ఇంకా తెలియలేదు. అదృశ్యమై రెండు రోజులవుతున్నా ఇంకా శ్రీహర్ష
ఖమ్మం జిల్లా వాసి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నే ఉదయ్ ప్రతాప్ ఏకైక కుమారుడు ఉజ్వల్ శ్రీహర్ష ఆచూకీ ఇంకా తెలియలేదు. అదృశ్యమై రెండు రోజులవుతున్నా ఇంకా శ్రీహర్ష సమాచారం లేదు. దీంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన పెరిగింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లండన్ బీచ్ పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్లతో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం లండన్ వెళ్లిన శ్రీహర్ష.. శుక్రవారం(ఆగస్టు 23,2019) నుంచి కనిపించటం లేదని కుటుంబసభ్యులకు లండన్ పోలీసులు సమాచారం ఇచ్చారు. 2 రోజుల నుంచి కాలేజీకి రావటం లేదని కుటుంబ సభ్యులకు కాలేజీ యాజమాన్యం తెలిపింది. లండన్ బీచ్ సమీపంలో ఉజ్వల్ శ్రీ హర్ష ఫోన్ ని పోలీసులు గుర్తించారు.
హర్ష ఆచూకీ కోసం బీజేపీ జాతీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. లండన్ పోలీసులతో మాట్లాడుతున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో పాటు లండన్‌లో ఉన్న తెలుగు వారితో మాట్లాడి.. శ్రీహర్ష ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తానని ఎంపీ నామా నాగేశ్వర రావు తెలిపారు. శ్రీహర్ష మిస్సింగ్ సమాచారం తెలియగానే బంధువులు, స్థానిక రాజకీయ నేతలు ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించారు. శుక్రవారం(ఆగస్టు 23,2019) లండన్‌లోని ఓ బీచ్‌లో శ్రీహర్ష సెల్‌ఫోన్, బ్యాగు, ల్యాప్‌టాప్ పోలీసులు కనుగొన్నారు. వాటి ద్వారా శ్రీహర్ష అదృశ్యమైనట్టు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Also Read : రేషన్ కార్డుదారులకు బిగ్ రిలీఫ్ : EKYC చేయకున్నా సరుకులు