ఆర్టికల్ 370 ని రద్దు చేస్తే పాకిస్తాన్ కు ఎందుకు బాధ : కిషన్ రెడ్డి

ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మకమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని సాహసాన్ని మోడీ ప్రభుత్వం చేసిందని కొనియాడారు.

  • Published By: veegamteam ,Published On : September 1, 2019 / 10:52 AM IST
ఆర్టికల్ 370 ని రద్దు చేస్తే పాకిస్తాన్ కు ఎందుకు బాధ : కిషన్ రెడ్డి

ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మకమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని సాహసాన్ని మోడీ ప్రభుత్వం చేసిందని కొనియాడారు.

ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మకమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని సాహసాన్ని మోడీ ప్రభుత్వం చేసిందని కొనియాడారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370, 35ఏ ను ఇటీవల పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దైన క్రమంలో ఆదివారం (సెప్టెంబర్1, 2019) నెల్లూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ ఆశయాన్ని మోడీ నెరవేర్చారన్నారు. 

ఆర్టికల్ 370 దేశంలో తీవ్ర వాదాన్ని ప్రోత్సహించిందన్నారు. అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆ చట్టాన్ని భారత ప్రజలపై రుద్దారని చెప్పారు. ఆర్టికల్ 370 ని రద్దు చేస్తే పాకిస్తాన్ కు ఎందుకు బాధన్నారు. కశ్మీర్‌ కోసం పాకిస్థాన్‌తో ఇప్పటి వరకు 4 యుద్ధాలు చేశామన్నారు. అవసరమైతే మరోసారి చేసేందుకైనా సిద్ధమన్నారు. 

మోడీ పాకిస్తాన్ ను ఏకాకి చేసి అన్ని దేశాల మద్దతు కూడగట్టారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కేంద్ర నిధులతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఒకే దేశం.. ఒకే జెండా ఉండాలన్నదే మోడీ ఆకాంక్ష అన్నారు. దేశ సమగ్రతకు బీజేపీ కృషి చేస్తోందన్నారు.

Also Read : సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హత్యకేసులో ముందడుగు : పోలీసులకు చిక్కిన హేమంత్!