Savings Schemes : పెట్టుబడి పెడుతున్నారా? ఈ బ్యాంకులో రూ. 2లక్షలు డిపాజిట్ చేయండి చాలు.. ఎంత వడ్డీ వస్తుందో తెలిస్తే షాకవుతారు..!
Savings Schemes : పీఎన్‌బీలో 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలానికి ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. రూ. 2లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

Savings Schemes
Savings Schemes : పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? ఎందులో పెట్టుబడి పెడితే అధిక రాబడి పొందవచ్చుని ఆలోచిస్తున్నారా? అయితే, మీకోసం పంజాబ్ (Savings Schemes) నేషనల్ బ్యాంకు (PNB) అద్భుతమైన వడ్డీని అందిస్తోంది. మీరు చేయాల్సిందిల్లా ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడమే..
ఇటీవలే జరిగిన ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పును ప్రకటించలేదు. అంతకన్నా ముందే రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 1.00 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ గత ఫిబ్రవరిలో రెపో రేటును 0.25 శాతం, ఏప్రిల్‌లో 0.25 శాతం, జూన్‌లో 0.50 శాతం తగ్గించింది.
రెపో రేటును 1.00 తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు కూడా FD వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇప్పుడు FD అకౌంట్లపై 3.25 శాతం నుంచి 7.40 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
390 రోజుల ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ :
పీఎన్‌బీ బ్యాంకులో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు FD అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ బ్యాంకు 390 రోజుల ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీని అందిస్తోంది. సాధారణ పౌరులకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు పైబడిన వృద్ధులు) 7.40 శాతం వడ్డీని అందిస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2 ఏళ్ల కాలపరిమితి FDపై సాధారణ పౌరులకు 6.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.90 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీని అందిస్తోంది.
2 ఏళ్ల FDలో రూ. 2 లక్షలు డిపాజిట్.. రూ. 30,681 వడ్డీ :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో రెండేళ్ల ఎఫ్‌డీ స్కీమ్ (Savings Schemes)లో రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 2,27,080 పొందవచ్చు. ఇందులో రూ. 27,080 ఫిక్స్‌డ్ వడ్డీ పొందవచ్చు. మీరు సీనియర్ సిటిజన్ అయితే.. ఇదే బ్యాంకులో 2ఏళ్ల FDలో రూ. 2 లక్షలు డిపాజిట్‌పై రూ. 2,29,325 ఫిక్స్‌డ్ వడ్డీ వస్తుంది.
ఇందులో రూ. 29,325 వడ్డీనే పొందవచ్చు. మీరు సూపర్ సీనియర్ సిటిజన్ అయితే.. పీఎన్‌బీలో 2 ఏళ్ల FDలో రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే.. మీకు రూ. 2,30,681 హామీతో కూడిన వడ్డీ వస్తుంది. ఇందులో కేవలం రూ. 30,681 వడ్డీనే పొందవచ్చు.