FASTag Annual Pass : కొత్త ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ కావాలా? ధర ఎంత? బెనిఫిట్స్, అర్హతలు, ఎలా అప్లయ్ చేయాలి? ఫుల్ గైడ్ మీకోసం..!

FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ యూజర్ల కోసం సరికొత్త వార్షిక పాస్ తీసుకొచ్చింది. ఈ కొత్త పాస్ విధానం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది.

FASTag Annual Pass : కొత్త ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ కావాలా? ధర ఎంత? బెనిఫిట్స్, అర్హతలు, ఎలా అప్లయ్ చేయాలి? ఫుల్ గైడ్ మీకోసం..!

FASTag Annual Pass

Updated On : August 16, 2025 / 2:32 PM IST

FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 15 నుంచే రోజువారీ ప్రయాణికులకు ఫాస్ట్ ట్యాగ్ (FASTag) వార్షిక పాస్ అందుబాటులోకి వచ్చింది. కేవలం (FASTag Annual Pass) రూ.3వేలతో ఈ వార్షిక ప్లాన్ సొంతం చేసుకోవచ్చు. ఏడాది పాటు జాతీయ రహదారి (NH), జాతీయ మోటార్‌వే (NE) ఫీజు ప్లాజాల వద్ద 200 వరకు ఫ్రీ టోల్ క్రాసింగ్‌ అందిస్తుంది.

ఈ ప్లాన్ ద్వారా ప్రయాణికులు చెల్లించే టోల్ పన్నులను క్రాసింగ్‌కు రూ.15 నుంచి రూ.20కి తగ్గిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫాస్ట్ ట్యాగ్ ధర రూ.70 నుంచి రూ.100 మధ్య ఉంటుంది. ఈ ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ టోల్ ప్లాజాల వద్ద క్యూ అవసరం ఉండదు. ఇంతకీ వార్షిక పాస్ పొందడానికి ఎవరు అర్హులు? వ్యాలిడిటీ ఏంటి? ఎలా అప్లయ్ చేసుకోవాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ధర, వ్యాలిడిటీ :
ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ఏడాదికి రూ. 3వేలు చెల్లించాలి. ఏదైనా నేషనల్ హైవే లేదా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ప్రతిసారీ టోల్ చెల్లించకుండా 200 టోల్ క్రాసింగ్‌ చేయొచ్చు. ఈ ప్లాన్ యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది వరకు లేదా 200 ట్రిప్పులకు ఏది ముందుగా వస్తే అది చెల్లుతుంది.

రెండు లిమిట్స్ దాటిన తర్వాత పాస్ ఆటోమాటిక్‌గా సాధారణ ఫాస్ట్ ట్యాగ్‌కు తిరిగి వస్తుంది. ఒకవేళ వార్షిక పాస్ మరో ఏడాది లేదా 200-ట్రిప్పుల లిమిట్ పెంచుకోవాలంటే ఈ పాస్‌ను రెన్యువల్ చేయించుకోవాలి.

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ అర్హతలివే :

ఈ వార్షిక పాస్ అనేది కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేట్, వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంది. వాహన్ డేటాబేస్‌లో వివరాలు అందుబాటులో ఉన్నాయి. ట్రక్ డ్రైవర్లు లేదా బస్సు డ్రైవర్లు వంటి వాణిజ్య వాహనాలు ఈ పాస్‌కు అర్హులు కాదు. వార్షిక పాస్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. లేదంటే స్టాండర్డ్ రేట్ల వద్ద సాధారణ టోల్ పేమెంట్లతో ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ కొనసాగించవచ్చు.

Read Also : UPI Users : UPI యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ ఖతం.. మీ మంచి కోసమే..!

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ఫీజు ప్లాజాలు (FASTag Annual Pass)  :
నేషనల్ హైవే (NH), నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే (NE) టోల్ ప్లాజాలలో వార్షిక పాస్‌ను వాడొచ్చు. రాష్ట్ర రహదారులు, స్థానిక అధికారులు నిర్వహించే రోడ్లు లేదా పార్కింగ్ సౌకర్యాలు FASTag పాస్‌ను అంగీకరించవు. వినియోగదారులు సాధారణ యూజర్ రుసుములను చెల్లించాల్సి ఉంటుంది.

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్.. ఎలా అప్లయ్ చేయాలి? :

  • రాజ్‌మార్గ్ యాత్ర యాప్ అధికారిక వెబ్‌సైట్ లేదా (NHAI/MoRTH) వెబ్‌సైట్‌లను విజిట్ చేయండి.
  • FASTag వార్షిక పాస్‌పై ట్యాప్ చేయండి.
  • FASTag ID, వాహనం వంటి మీ వివరాలను నింపండి.
  • ఇప్పుడు, UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ. 3వేలు చెల్లించండి.
  • ఆ తర్వాత వార్షిక పాస్ 2 గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది
  • మీకు SMS ద్వారా పాస్ యాక్టివేషన్ కన్ఫర్మేషన్ వస్తుంది.
  • మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ (VRN)కి యాక్టివ్ FASTag లింక్ అయి ఉండాలి.
  • విండ్‌షీల్డ్‌కు సరిగ్గా స్టిక్ చేసి ఉండాలి.