UPI Users : UPI యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ ఖతం.. మీ మంచి కోసమే..!

UPI Users : యూపీఐ యూజర్లు ఇకపై ఈ ఫీచర్ వాడలేరు. సైబర్ మోసాల కారణంగా మనీ రిక్వెస్ట్ ఫీచర్ ను NPCI తొలగిస్తోంది. ఎప్పటినుంచంటే?

UPI Users : UPI యూజర్లకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఈ ఫీచర్ ఖతం.. మీ మంచి కోసమే..!

UPI Users

Updated On : August 16, 2025 / 1:18 PM IST

UPI Users : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై యూపీఐ యాప్స్‌‌లో ఈ ఫీచర్ వాడలేరు. యూపీఐ యూజర్ల తమ డబ్బును భద్రంగా ఉంచుకోవచ్చు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది యూపీఐ (UPI Users) వాడుతున్నారు. చిన్నమొత్తం నుంచి పెద్ద పేమెంట్లు వరకు అన్నింటికి యూపీఐనే తెగ వాడేస్తున్నారు.

బిల్లులు చెల్లించడం లేదా స్నేహితులు, బంధువులకు డబ్బు పంపడం ఏదైనా సరే అన్నింటికి PhonePe, Google Pay, Paytm వంటి యాప్‌లనే వాడుతున్నారు. కానీ, యూపీఐ పేమెంట్లలో మనీ రిక్వెస్ట్ ఫీచర్ అనేది ఇక కనిపించదు.

ఈ ఫీచర్ కారణంగా సైబర్ మోసాలు ఎక్కువగా పెరిగిపోతున్న క్రమంలో NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) దాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి, ఫీచర్ పీర్-టు-పీర్ (P2P) కలెక్ట్ రిక్వెస్ట్’ అక్టోబర్ 1, 2025 నుంచి యూపీఐ యాప్‌లలో అందుబాటులో ఉండదు.

సైబర్ మోసగాళ్ళు ఈ ఫీచర్‌ను పెద్ద ఎత్తున వాడుతున్నారని NPCI చెబుతోంది. అందుకే ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు ఫీచర్ తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మనీ రిక్వెస్ట్ ఫీచర్ తొలగింపుతో యూపీఐ పేమెంట్ల విషయంలో యూజర్లపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Oppo K13 Turbo Pro : ఒప్పో K13 టర్బో ప్రో సేల్ మొదలైందోచ్.. ఇలా కొన్నారంటే చౌకైన ధరకే.. డోంట్ మిస్..!

P2P మనీ రిక్వెస్ట్ ఫీచర్ ఏంటి? :
యూపీఐలో ఈ ఫీచర్ సాయంతో ఏ యూజర్ అయినా మరో యూపీఐ యూజర్‌కు మనీ రిక్వెస్ట్ పంపవచ్చు. ఇతర యూపీఐ యూజర్ ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వెంటనే వారి యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే డబ్బులు డెబిట్ అవుతాయి.

యూపీఐ ప్రారంభంలో పేమెంట్లను మరింత సులభతరం చేసేందుకు ఈ ఫీచర్ తీసుకొచ్చారు. కానీ, కాలక్రమేణా ఇది స్కామర్లకు ఆయుధంగా మారింది. ఈ మోసాల కేసులు పెరిగిపోవడంతో NPCI ఇప్పుడు ఈ ఫీచర్ యూపీఐ యాప్స్ నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఇప్పుడు యూపీఐ యాప్ వాడే యూజర్లు ఇలాంటి మనీ రిక్వెస్ట్ పేమెంట్లు చేయలేరు.

ఈ ఫీచర్ తొలగింపు ఎందుకంటే? :

NPCI ప్రకారం.. సైబర్ మోసగాళ్ళు ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ మోసగాళ్ళు ఫేక్ ఐడెంటిటీ లేదా ఎమర్జెన్సీ అంటూ వినియోగదారుల నుంచి మనీ రిక్వెస్ట్ పంపుతున్నారు. అది నమ్మి యూపీఐ యూజర్లు ఆ రిక్వెస్ట్ అంగీకరిస్తే యూపీఐ పిన్ అవసరం లేకుండానే డబ్బులు బ్యాంకు అకౌంట్ నుంచి కట్ అయిపోతాయి.

ఈ ఫీచర్ కోసం గతంలో రూ. 2వేలు లిమిట్ సెట్ చేసినా ఇప్పటికీ యూపీఐ చీటింగ్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ఈ మనీ రిక్వెస్ట్ ఫీచర్ పూర్తిగా నిలిపివేయాలని ఎన్‌పీసీఐ నిర్ణయించింది.

డబ్బులు  ఎలా పంపాలంటే? :
అక్టోబర్ 1, 2025 తర్వాత యూపీఐ యూజర్లు నగదు పంపడం లేదా రిక్వెస్ట్ కోసం ఇలా చేయాల్సి ఉంటుంది. QR కోడ్‌ స్కాన్ చేయడం ద్వారా డబ్బు పంపుకోవచ్చు. మొబైల్ నంబర్ లేదా UPI ID ఎంచుకోవడం ద్వారా లావాదేవీ పూర్తి చేయొచ్చు. బ్యాంకు అకౌంట్ నంబర్, IFSC కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా నేరుగా పేమెంట్ చేయొచ్చు.

ఈ సర్వీసులపై నో ఎఫెక్ట్ :
యూపీఐ సర్వీసుల్లో ముఖ్యంగా Flipkart, Amazon, Swiggy, IRCTC వంటి మర్చంట్ సర్వీసులపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు మునుపటిలా పేమెంట్ రిక్వెస్ట్ పొందవచ్చు. ఈ రిక్వెస్ట్ ఆమోదించిన తర్వాత యూపీఐ పిన్‌ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయొచ్చు.