floods In Death Valley : మృత్యులోయలో 1000 ఏళ్లకు కురిసిన భారీ వర్షం..వరదల్లో చిక్కుకున్న 1000మంది..

Death Valley లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ వరదలకు డెత్ వ్యాలీలో 1000మంది చిక్కుకుపోయారు.

floods In Death Valley : మృత్యులోయలో 1000 ఏళ్లకు కురిసిన భారీ వర్షం..వరదల్లో చిక్కుకున్న 1000మంది..

floods In Death Valley

floods In Death Valley : అదొక మృత్యులోయ (Death Valley). పేరుకు తగినట్లుగానే అక్కడికి వెళ్లినవారు ఎవ్వరు ప్రాణాలతో తిరిగి రావటం చాలా చాలా కష్టం. ఎందుకంటే తాగటానికి గుక్కెడు నీరు కూడా ఉండదు. నీడనిచ్చే ఒక్క చెట్టు కాదు కదా..చిన్న పచ్చని మొక్క కూడా కనిపించదు. ఎటు చూసినా కొండలు,గుట్టలే కనిపిస్తుంటాయి. ఎడారిలా కనిపిస్తుంటుంది. అటువంటి మృత్యులోయలో ఈ సంవత్సంర భారీ వర్షాలు కురిశాయి.వరద పొంగి పొర్లింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీలో అది కూడా వెయ్యేళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి వర్షం కురుస్తుందన్న రీతిలో వర్షపాతం నమోదైంది. దాంతో ఆ మృత్యులోయలో ఏకంగా వరదలు పొంగిపొర్లాయి.

ప్రపంచంలోనే అత్యంత అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఈ డెత్ వ్యాలిలోనే. అందుకే దీన్ని డెత్ వ్యాలీ అంటారు. ఇటువంటి ప్రమాదకర ప్రదేశంలో ఒక్క వాన చినుకు పడినా అది చాలా చాలా గొప్ప విషయమే. అలాంటిది ఏడాది భారీ వర్షాలు కురిసాయి. దీంతో వరదలు పొంగిపొర్లాయి. అది కూడా వెయ్యేళ్లకు ఒకసారి మాత్రమే ఇలాంటి వర్షం కురుస్తుందన్న రీతిలో వర్షపాతం నమోదైంది. దాంతో ఆ మృత్యులోయలో ఏకంగా వరదలు సంభవించాయి.

కాగా..ఈ డెత్ వ్యాలీ ప్రాంతాన్ని సందర్శించేందుకు అమెరికా ప్రభుత్వం పర్యాటకులను అనుమతిస్తోంది. ఆ విధంగా పర్యటనకు వచ్చిన 500 మందికి పైగా టూరిస్టులు, 500 మంది సిబ్బంది ఈ వరదల ధాటికి అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు 30 వాహనాలు బురదలో కూరుకుపోయాయి. ఆరు గంటల నరకం అనంతరం వారందరూ సురక్షితంగా బయటపడగలిగారు. గత రెండు వారాల వ్యవధిలో ఇలాంటి కుండపోత వర్షం పడడం ఇది నాలుగో సారి కావటం మరో విశేషం.