Yuzuvendra Chahal : చాహ‌ల్ అరుదైన ఘ‌న‌త‌.. టీ20ల్లో 300 మ్యాచులు ఆడిన భార‌త క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా?

యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Yuzuvendra Chahal : చాహ‌ల్ అరుదైన ఘ‌న‌త‌.. టీ20ల్లో 300 మ్యాచులు ఆడిన భార‌త క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా?

Chahal 300 T20 games

యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20 క్రికెట్‌లో 300 మ్యాచులు ఆడిన 11వ భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున చాహ‌ల్ ఆడుతున్నాడు. ఉప్ప‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదారాబాద్ తో మ్యాచ్ ద్వారా చాహ‌ల్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

టీ20ల్లో అత్య‌ధిక మ్యాచులు ఆడిన భార‌త ఆట‌గాడిగా రోహిత్ శ‌ర్మ కొన‌సాగుతున్నాడు. రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు 436 టీ20 మ్యాచులు ఆడాడు. ఆ త‌రువాతి స్థానాల్లో దినేశ్ కార్తీక్‌, ఎంఎస్ ధోని ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు.

T20 World Cup 2024 : కేఎల్ రాహుల్ కంటే సంజూ శాంస‌న్ బెట‌ర్‌.. కుండబ‌ద్ద‌లు కొట్టిన అజిత్ అగార్క‌ర్‌

టీ20ల్లో అత్య‌ధిక మ్యాచులు ఆడిన భార‌త ఆట‌గాళ్లు..
రోహిత్ శర్మ – 436 మ్యాచులు – 11471 ప‌రుగులు
దినేష్ కార్తీక్ – 396 మ్యాచులు – 7343 ప‌రుగులు
ఎంఎస్ ధోని – 387 మ్యాచులు – 7367 ప‌రుగులు
విరాట్ కోహ్లీ – 386 మ్యాచులు – 12494 ప‌రుగులు
సురేష్ రైనా – 336 మ్యాచులు – 8654 ప‌రుగులు
శిఖ‌ర్ ధావ‌న్ – 334 మ్యాచులు – 9797 ప‌రుగులు
ర‌వీంద్ర జ‌డేజా – 319 మ్యాచులు – 3539 ప‌రుగులు
అంబ‌టి రాయుడు – 303 మ్యాచులు – 6176 ప‌రుగులు
మ‌నీష్ పాండే – 302 మ్యాచులు – 6849 ప‌రుగులు
యుజ్వేంద్ర చాహల్ – 300 మ్యాచులు – 349 వికెట్లు

Ruturaj Gaikwad : చెన్నై కెప్టెన్ల‌లో రుతురాజ్ ఒక్క‌డే.. ధోనికి సాధ్యం కాలేదు.. ఆ రికార్డు ఏంటో తెలుసా?

ఈ రికార్డు మ్యాచ్‌లో చాహ‌ల్ విఫ‌లం అయ్యాడు. నాలుగు ఓవ‌ర్లు వేసి 62 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.