నాసా అంతరిక్షంలోకి పంపే హెలికాఫ్టర్‌కు పేరు పెట్టిన భారత సంతతి బాలిక

  • Published By: vamsi ,Published On : May 1, 2020 / 07:12 AM IST
నాసా అంతరిక్షంలోకి పంపే హెలికాఫ్టర్‌కు పేరు పెట్టిన భారత సంతతి బాలిక

అమెరికాలో భారత సంతతి బాలిక ప్రతి భారతీయుడు.. భారతీయురాలు గర్వించే పని చేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అరుణగ్రహంపైకి  పంపనున్న తొలి హెలికాఫ్టర్‌కు 17 ఏళ్ల భారత సంతతి బాలిక వనీజా రూపానీ సూచించిన పేరును నాసా పెట్టింది. అలబామాలోని నార్త్ పోర్ట్‌కు చెందిన బాలిక 12వ తరగతి చదువుతోంది.

ఈ హెలికాప్టర్‌ అంతరిక్ష నౌక తో పాటు ప్రయాణం చేస్తుంది అని నాసా ట్వీట్‌ చేసింది. అంతరిక్ష నౌక పర్సెవరెన్స్, ఇంజెన్యూటీలను జూలైలో నాసా అంతరిక్షంలోకి పంపనుంది. చిన్నప్పటినుంచి రూపానీకి అంతరిక్ష శాస్త్రం పై ప్రత్యేక ఆసక్తి ఉండేదని ఆమె తల్లి నౌషీన్‌ రూపానీ చెప్పారు. ఈ క్రమంలోనే మార్స్‌లో ప్రయాణించేందుకు రూపొందించిన హెలికాఫ్టర్‌కు పేరును సూచించాల్సిందిగా నాసా ‘‘నేమ్ ది రోవర్’’ పేరిట పోటీని నిర్వహించగా.. 28వేల ఎంట్రీలు వచ్చాయి. అందులో ఈ బాలిక రాసిన వ్యాసం మొదటిదిగా ఎంపికైంది.(అమెరికాకు యానిమేటెడ్ వీడియోలో చైనా ఎంబస్సీ కౌంటర్)

ఇందులో వనీజా సూచించిన చాతుర్యం (ఇంజెన్యూటీ) పేరును హెలికాఫ్టర్‌కు పెట్టారు. అలాగే నాసా తర్వాత పంపనున్న మరో రోవర్‌కు కూడా పేరును ఫైనల్ చేశారు. చాతుర్యం అనేది మనుషులతో అద్భుతమైన పనులను చేయిస్తుందని, విశ్వం అంచుల వరకు కూడా మనుషులను తీసుకెళ్తుందని వనీజా తన వ్యాసంలో ప్రస్తావించింది. తమ కుమార్తెకు చిన్నప్పటి నుంచి అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తి ఉందని ఆమె తల్లీ నౌషీన్ రూపానీ తెలిపారు.

రోజూ స్కూల్‌కు వెళ్లేటప్పుడు వనీజా, ఆమె తండ్రి కారును అంతరిక్ష నౌక అనుకునేదని, రోడ్డు పక్కన వున్న భవనాలను గ్రహాలనీ, ట్రాఫిక్ సిగ్నల్స్‌ని నక్షత్రాలుగా పిలిచేదని నౌషీన్ చెప్పారు. అంతరిక్ష నౌక పర్సెవరెన్స్, ఇంజెన్యూటీలను జూలైలో నాసా అంతరిక్షంలో పంపనుంది. 2021 ఫిబ్రవరిలో ఈ రెండూ అంగారకుడిపై 3.5 బిలియన్ ఏళ్ల క్రితం ఉనికిలో ఉన్నట్లుగా భావిస్తున్న సరస్సు వద్ద దిగనున్నాయని నాసా తెలిపింది.