ఏపీలో గుడిసెకు రూ.41వేల కరెంటు బిల్లు

ఏపీలో కరెంట్ బిల్లులు జనాలకు షాక్ ఇస్తున్నాయి. గుండెలు అదిరేలా చేస్తున్నాయి. భానుడి భగభగలకన్నా

  • Published By: naveen ,Published On : May 15, 2020 / 05:43 AM IST
ఏపీలో గుడిసెకు రూ.41వేల కరెంటు బిల్లు

ఏపీలో కరెంట్ బిల్లులు జనాలకు షాక్ ఇస్తున్నాయి. గుండెలు అదిరేలా చేస్తున్నాయి. భానుడి భగభగలకన్నా

ఏపీలో కరెంట్ బిల్లులు జనాలకు షాక్ ఇస్తున్నాయి. గుండెలు అదిరేలా చేస్తున్నాయి. భానుడి భగభగలకన్నా కరెంటు బిల్లులే ఎక్కువ మంట పుట్టిస్తున్నాయి. వేలల్లో వస్తున్న బిల్లులు చూసి జనాలు హడలిపోతున్నారు. ఇప్పటికే ఏపీలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల్లో తేడాలు వచ్చాయి. లెక్కకు మించి బిల్లు వస్తుండటంతో విద్యుత్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న సమయంలో మరో షాకింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. ఓ గుడిసెకు ఏకంగా రూ.41 వేల కరెంటు బిల్లు రావడం అందరిని ఆశ్చర్యపరిచింది. 

పూరి గుడెసెకు రూ.41,149 కరెంటు బిల్లు:
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో ఛాన్వి అనే మహిళ ఓ గుడిసెలో బీడీలు చుడుతూ నివసిస్తోంది. ఆమె ఇంట్లో ఒక టీవీ, రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. అలాంటి ఇంటికి ఏకంగా రూ.41వేల 149 కరెంట్ బిల్లు వచ్చింది. అంత పెద్ద మొత్తంలో బిల్లు రావడంతో ఆమె విస్తుపోయింది. పెద్ద బంగళాకు రావాల్సిన బిల్లు తనకు రావడంతో లబోదిబోమంది. కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే తనకు ఇంత కరెంటు బిల్లు రావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేసింది. లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ నెలలో కరెంటు బిల్లు రాలేదు. ఇప్పుడు రెండు నెలల(ఏప్రిల్, మే) కరెంటు బిల్లు ఒకేసారి వచ్చింది. ఈ క్రమంలో విద్యుత్ బిల్లులు భారీ మొత్తంలో వస్తున్నాయి. దీంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

రేకుల షెడ్డుకి రూ.28వేలు కరెంటు బిల్లు:
కాగా, తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సమీపంలోని ఓ గ్రామంలో పూరి గుడిసెలో ఉండే ఓ కుటుంబానికి రూ.17 వేలు, మరో కాలనీలో రేకుల షెడ్డులో ఉంటున్న కుటుంబానికి రూ.28 వేల బిల్లు వచ్చింది. దీంతో వారు తలలు పట్టుకున్నారు. ఇన్నేళ్లుగా వేసవిలోనూ వందల్లోనే బిల్లులు వచ్చేవని వారు చెబుతున్నారు. దీనిపై విద్యుత్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read Here>> ఏపీలో పొలాల్లో PPE కిట్ల కలకలం… కరోనా భయంతో తగలబెట్టాడు