Tdp Manifesto : కూటమి మ్యానిఫెస్టోలో కనిపించని బీజేపీ, కాపీని ముట్టుకునేందుకు కూడా ఇష్టపడని నేత.. ఏం జరుగుతోంది?

అయితే, మ్యానిఫెస్టోకు తమ మద్దతు ఉంటుందని సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు.

Tdp Manifesto : కూటమి మ్యానిఫెస్టోలో కనిపించని బీజేపీ, కాపీని ముట్టుకునేందుకు కూడా ఇష్టపడని నేత.. ఏం జరుగుతోంది?

Updated On : April 30, 2024 / 7:50 PM IST

Tdp Manifesto : ఏపీ కూటమిలో ఉన్నది మూడు పార్టీలు అయినప్పటికీ.. మ్యానిఫెస్టో మాత్రం రెండు పార్టీలు కలిసే ప్రకటించాయి. కూటమి మ్యానిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దూరంగా ఉన్నారు.

మరోవైపు కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేత సిద్ధార్ధ్ నాధ్ సింగ్ మ్యానిఫెస్టో కాపీని పట్టుకునేందుకు కూడా ఇష్టపడలేదు. దీంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే, మ్యానిఫెస్టోకు తమ మద్దతు ఉంటుందని సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ఒకే మ్యానిఫెస్టో ఉంటుందని.. లోకల్ గా ఉండవని చెప్పారు.

Also Read : మోదీ ఫొటో ఎందుకు లేదో తెలుసా..? కూటమి మ్యానిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు