Ginger Cultivation : అల్లం సాగులో సస్యరక్షణ, చీడపీడల నివారణ!

ఈ తెగులు ఆశించిన దుంపలు మెత్తగా అవుతాయి. చర్మం వదులుగా ఉండి ఊడివస్తుంది. తెగులు ఉదృతి ఎక్కువైనప్పుడు మొక్కలు ఎండి పడిపోతాయి. నిలువలో కూడ ఈ తెగులు ఉదృతి పెరిగి దుంపలు కుళ్ళిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన తెగులు సోకని దుంపలను నాటడానికి ఎన్నుకోవాలి విత్తన శుద్ది పాటించాలి

Ginger Cultivation : అల్లం సాగులో సస్యరక్షణ, చీడపీడల నివారణ!

Crop Protection Ginger

Ginger Cultivation : నీడపటున పండే పంటలలో అల్లం ఒకటి. మామిడి, కొబ్బరి, బొప్పాయి, నిమ్మ, ద్రాక్ష, అరటి మొక్కల మధ్య అల్లం సాగు చేపట్టవచ్చు. తేమతో కూడిన వాతావరణం అల్లం సాగుకు అనుకూలంగా ఉంటుంది. నీరు నిలవని, ఇసుకతో కూడిన బంక నేలలు, ఎర్రనేలలు, నల్లమట్టి నేలలు అనుకూలం. విత్తుకునేందుకు ఆరోగ్యకరమైన దుంపలను సాగుకు ఎన్నుకోవాలి. విత్తే ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి. చీడపీడల విషయంలో సరైన యాజమాన్యపద్దతులు పాటిస్తే అల్లం సాగు రైతులకు మంచి లాభసాటిగా ఉంటుంది. చీడపీడలు ఆశిస్తే సకాలంలో జాగ్రత్త చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

అల్లం సాగులో సస్య రక్షణ, చీడపీడల నివారణ ;

దుంప కుళ్ళు ఈగ: దీని పిల్ల పురుగులు మొత్తని కుళ్ళు ఆశించిన దుంపలను మరియు కాండాన్ని తొలిచి లోపలి పదార్దాన్ని తినేయడం వల్ల మొక్కలు చనిపోతాయి. దీని నివారణకు వేడి వాతావరణంలో దుక్కులు లోతుగా దున్నాలి. దుంప కుళ్ళును తట్టుకునే, పీచు తక్కువగా వుండే అల్లం రకాలను సాగుచేయాలి. మురుగునీటి కాలవలు ఏర్పాటు చేసి నీరు నిలవకుండా చేయాలి. ఎకరాకు 10 కిలోల కార్బ్చోవ్యూరాన్‌ ౩ జి గుళికలను సన్నటి ఇసుకతో కలిపి తోటంతా సమంగా వేసుకోవాలి.

ఆకు ముడత పురుగు : వీటి లార్వా ఆకులను చుట్టి తినేస్తుంది. నివారణకు ప్రాఫెనోఫాస్‌ 1 మి.లీ./లీటర్‌ చాప్పున శాండోవిట్‌తో కలిపి 200 మిల్లీ లీటర్లు ఎకరానికి మందు ద్రావణం అకులపై పిచికారి చేయాలి.

మొవ్వు తొలుచు పురుగు : ఈ పురుగు మొవ్వను తొలచటం వలన మధ్య కొమ్ము చనిపోతుంది దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్‌ 2 మి.లీ. + సాండోవిట్‌ 1 మి.లీ. లేదా లీటరు నీటికి క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. + సాండోవిట్‌ 1 మి.లీ. లేదా లీటరు నీటికి ప్రాఫెనోఫాస్‌ 2 మి.లీ. + సాండోవిట్‌ 1 మి.లీ. కలిపిన ద్రావణాన్ని మొవ్వు ఆకులపై పిచికారి చేయాలి.

బ్యాక్టీరియా వడలు తెగులు : ఈ తెగులు ఎక్కువగా జులై మాసం నుండి ఆగష్టు నెలలో ఎక్కువగా ఆశిస్తుంది తెగులొచ్చిన ఆకుల అంచులు ఇత్తడి రంగుకు మారి వెనుకకు ముడుచుకు పోతాయి. క్రమేపి మొక్క వడలి ఎండిపోవుతుంది. భూమికి దగ్గరలోని కాండంను పరిశిలించినట్టయితే చెడు వాసన వేస్తుంది ఈ తెగులు లక్షణాలు ఎక్కువగా సాయంత్రం వేళలో ఎక్కువగా కనిపిస్తుంది. నివారణకు ఆరోగ్యకరమైన దుంపలను ఎంపిక చేసుకోవాలి. తెగులు లక్షణాలను కన్పించగానే స్టెష్టోసైక్లిన్‌ ను 20 గ్రాములు/100 లీటర్ల నీటికి మరియు కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ (2 మీ.లి./ లీటరు నీటికి) కలిపి మొక్క వేర్లు వద్ద పోసుకోవాలి.

పొలుసు పురుగు: విత్తన దుంపలను ఆశించి రసం పీలుస్తుంది దీని నివారణకు విత్తన దుంపలను లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున మలాథాయాన్‌ కలిపిన ద్రావణంలో 30 నిమిషాలు నాననిచ్చి తీసి ఆరబెట్టి విత్తుకోవాలి.

వేరుపురుగు: దుంపల మొదళ్ళలో వేర్లను కత్తిరిస్తుంది. నష్టం గమనించగానే ఫోరేట్‌ 5 కిలోలు లేదా కార్బోవ్యూరాన్‌ గుళికలు 7 కిలోలు/ఎ. వేసి తీవ్రతను తగ్గించుకోవచ్చు.

ఫిల్లోస్టిక్సా ఆకుమచ్చ తెగులు : ఈ తెగులు ఆకులపై జూలై-అక్టోబర్‌ మాసాలలో గమనించవచ్చును. ప్రారంభ దశలో ఆకులపై అండాకారంలో లేదా నిర్ణీత ఆకారంలో లేని నీటిని పీల్చుకున్నట్లుగా ఉండే మచ్చలు ఏర్పడతాయి తరువాత మచ్చల యొక్క అంచులు ముదురు గోధుమ రంగు కలిగి యుండి మధ్య భాగము పసుపు రంగులోకి మారును. ఆకులు పెళుసుగా మారతాయి. అనేక నల్లటి మచ్చలు చుక్కలుగా ఆకుల ఉపరితలంపై ఏర్పడి ఆకులు ఎండి పోవును. దీని నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ గల శిలీంధ్రనాశిని (బ్లెటాక్స్‌) మందును 3 గ్రా॥ లీటరు నీటికి ఎకరాకు 600 గ్రాములు, 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కంతా బాగా తడిచేలా పిచికారీ చేయాలి.

దుంపకుళ్ళు తెగులు : అధిక నష్టం చేసే ఈ తెగులు వలన ఎకరాకు 10-20 క్వి. దిగుబడులు తగ్గుతాయి మురుగు నీటి కాలువలు లేకపోతే దంపకుళ్ళు సమస్య తీవ్రమవుతుంది. 50 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి ఎక్కువ వర్షపాతం, నీరు నిలిచే పరిస్థితులు ఈ తెగులుకు అనుకూలం. భూమిలో మరియు కోమ్మలపై ఈ వ్యాధికారక శిలీంధ్రాలు జీవించి వుండి నీరు ద్వారా వ్యాపిస్తాయి.

ఈ తెగులు ఆశించిన దుంపలు మెత్తగా అవుతాయి. చర్మం వదులుగా ఉండి ఊడివస్తుంది. తెగులు ఉదృతి ఎక్కువైనప్పుడు మొక్కలు ఎండి పడిపోతాయి. నిలువలో కూడ ఈ తెగులు ఉదృతి పెరిగి దుంపలు కుళ్ళిపోతాయి. దీని నివారణకు ఆరోగ్యవంతమైన తెగులు సోకని దుంపలను నాటడానికి ఎన్నుకోవాలి విత్తన శుద్ది పాటించాలి. నీరు నిల్వ ఉండకుండా చూడాలి వేప పిండి ఎరువును వేసుకోవాలి సరైన ఎరువులు యాజమాన్యం పాటించాలి తెగులు సోకిన మొక్కల మొదట్లో మెటలాక్సిల్‌ లేదా మంకోజెబ్‌ 5 గ్రా లీటరు నీటిలో కలుపుకొని పోసుకోవాలి కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా॥ ట్రైకోడెర్మా విరిడి 5 గ్రా॥ లీటరు నీటికి కలిపి తెగులు సోకిన మొక్కల చుట్టూ ఉన్న 4-5 మొక్కలకు మరియు వరుసల్లోని పాదులను ముంపుగా తడపడం వలన దుంప కుళ్ళు ఉధృతిని తగ్గించుకోవచ్చు.

ఆకుమాడు తెగులు : ఈ తెగులు లక్షణాలు మొదట భూమికి దగ్గరగా వున్న ఆకుల తొడిమలపై పొడవాటి రూపంలో కనిపిస్తాయి. ఈ మచ్చలు మొదట పేలవమైన ఆకుపచ్చ రంగు నీటి మచ్చలుగా ఏర్పడి తర్వాత గోధుమ రంగుకు మారతాయి ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి పై ఆకులకు అకు తొడిమెలకు వ్యాప్తి చెంది ఆకులు అకు తొడిమెలు మాడిపోతాయి దీని నివారణకు శుభ్రమైన పంట సాగు, పంట అవశేషాలను నాశనం చేయడం మరియు 1 గ్రా! కార్చెండిజిమ్‌ లేదా ప్రాపికొనజోల్‌ 1 మి.లీ. లీటరు నీటి చొప్పున కలిపి పిచికారి చేయాలి.