పార్క్ లో విచిత్రం : మంటలు వ్యాప్తిస్తున్నా కాలిపోని చెట్లు,గడ్డి,బెంచీలు

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2020 / 06:50 AM IST
పార్క్ లో విచిత్రం : మంటలు వ్యాప్తిస్తున్నా కాలిపోని చెట్లు,గడ్డి,బెంచీలు

సాధారణంగా ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగినప్పడు మంటలు వేగంగా వ్యాపిస్తే ఆ పరిధిలో ఉన్నవి కాలిపోతుండటం మనం చూస్తుంటాం. అయితే ఓ పార్క్ లో జరిగిన అగ్నిప్రమాదం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంటలు వేగంగా వ్యాప్తిస్తూ ముందుకు కదులుతున్నప్పటికీ చెట్లు,గడ్డి మాత్రం తగలబడలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

స్పెయిన్ లోని  కలహొర్రా అనే మున్సిపాలిటీ టౌన్ లోని ఓ పార్క్ లో…మంటలు వ్యాపించాయి. మంట సముద్రంలో అల వచ్చినట్లుగా వెళ్తూ… ఎండిన గడ్డి మొక్కల్ని మాత్రమే తగలబెట్టింది. మధ్యలో ఉన్న చెక్క బెంచీలను కూడా మంటలు ఏం చేయలేదు. మంటలు అలలాగా ముందుకు సాగడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

మంటకు వెనక వైపు నుంచి బలమైన గాలి వీయడం వల్ల ఇలా జరిగిఉంటుందని అంచనా భావిస్తున్నారు. క్లబ్ డీ మోన్టనా కలహొర్రా అనే ఎన్జీవో ఈ వీడియోని మొదట ఫేస్ బుక్ లో షేర్ చేసింది.  కారణంగా ఎవ్వరికీ గాయాలు కాలేదని, ప్రాపర్టీ డ్యామేజ్ జరుగలేదని స్థానిక రిపోర్టులు తెలిపాయి. పార్క్ లో మంటలు వ్యాపించిన కొద్దిసేపటి తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకుని మంటలను ఆర్పేసినట్లు తెలిపాయి.

Read More: 

ఒమన్ తీరంలో భారీ ప్రమాదం…సొంత నౌకపైనే ఇరాన్ మిసైల్ ప్రయోగం

రోబో కుక్క.. సామాజిక దూరం పాటించకపోతే అంతే..