ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? తుది ఫలితాలు ఇలాగే ఉంటాయా? తెలకపల్లి రవి విశ్లేషణ..
కొన్ని సర్వే సంస్థలు మరోసారి వైసీపీదే అధికారం అని తేలిస్తే.. మరికొన్ని సంస్థలు మాత్రం టీడీపీ కూటమికి పట్టంకట్టాయి. దీంతో ఏపీ జనాల్లో టెన్షన్ మరింత పెరిగింది.

Exit Polls 2024 : ఎప్పుడెప్పుడా అని అటు రాజకీయ నాయకులు ఇటు ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. అటు దేశంలో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై పలు సర్వే సంస్థల తమ తమ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఎక్కడ ఎవరు అధికారంలోకి రానున్నారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఓడిపోయే ప్రముఖులు ఎవరు? ఇలా అన్నింటిపై సర్వే సంస్థలు తమ అంచనాలు వెల్లడించాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని మెజార్టీ సంస్థలు అంచనా వేశాయి. ఇక తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తాయని తేల్చాయి.
ఇక ఏపీ విషయానికి వస్తే.. ఎగ్జిట్ పోల్స్ మరింత ఉత్కంఠను పెంచాయని చెప్పాలి. ఎందుకంటే.. కొన్ని సర్వే సంస్థలు మరోసారి వైసీపీదే అధికారం అని తేలిస్తే.. మరికొన్ని సంస్థలు మాత్రం టీడీపీ కూటమికి పట్టంకట్టాయి. దీంతో ఏపీ జనాల్లో టెన్షన్ మరింత పెరిగింది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. పలు జాతీయ, స్థానిక సర్వే సంస్థలు చెప్పినట్లుగానే తుది ఫలితాలు ఉండనున్నాయా? ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? ఈ సర్వే సంస్థల క్రెడిబులిటీ ఎంత? ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అనాలసిస్..
Also Read : వైసీపీదే గెలుపు? భారీ మెజార్టీతో పవన్ విజయం? ఆరా మస్తాన్ సంచలన సర్వే