ఒమన్ తీరంలో భారీ ప్రమాదం…సొంత నౌకనే మిసైల్ తో పేల్చేసిన ఇరాన్

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2020 / 05:54 AM IST
ఒమన్ తీరంలో భారీ ప్రమాదం…సొంత నౌకనే మిసైల్ తో పేల్చేసిన ఇరాన్

ఒమన్ తీరప్రాంతంలో జరిగిన నేవీ మిసైల్ యాక్సిడెంట్ కారణంగా పదులసంఖ్యలో ఇరాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పలువరు ఇరాన్ సైనికులు అదృశ్యమయ్యారు. సోమవారం ఉదయం నావెల్ ఎక్సర్ సైజ్ లో భాగంగా…. ఒమన్ తీరానికి దగ్గర్లో ఇరాన్ యుద్ధనౌక “జమరాన్” నుంచి మరో ఇరాన్ రవాణా నౌక “కోనారక్” పై C-802 మిసైల్ ను ప్రయోగించారు. అయితే ఈ ప్రాసస్ లో కోనారక్ నౌక తీవ్రంగా దెబ్బతింది. కొనారక్ నౌక.. ఒక క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించడానికి ఈ ప్రాంతానికి తీసుకువచ్చిందని కొన్ని నివేదికలు సూచించాయి

ఇరాన్ నావికాదళం ఒమన్ గల్ఫ్‌లో క్రమం తప్పకుండా సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంటుందన్న విషయం తెలిసిందే. అయితే సోమవారం ఉదయం జమరాన్ నుంచి ప్రయోగించిన మిసైల్ కారణంగా కోనారక్ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ఇరానియన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం..కోనారక్ నౌకలో 40మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC)ద్వారా ఆపరేట్ చేయబడుతున్న జమరాన్… నియమించబడిన స్థానానికి చేరుకోవడానికి కొనారక్ నౌక తేలియాడే లక్ష్యం( floating target)నుంచి సాగిపోతున్న సమయంలో క్షిపణిని ముందస్తుగా  ప్రయోగించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను మానవ తప్పిదంగా IRGC పేర్కొంది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే కొందరు స్థానికులు సముద్రంలోకి పడవలు వేసుకుని వెళ్లి మునిగిపోతున్న నేవీ సిబ్బందిని కాపాడి వారిని ఒడ్డుకు తీసుకొచ్చి అంబులెన్స్ లలో హాస్పిటల్ కు తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 ఇరాన్ యొక్క మొట్టమొదటి దేశీయ-నిర్మిత డిస్ట్రాయర్ అయిన జమారన్ నౌక సుమారు 120 మంది సిబ్బందిని మోసుకెళ్ళే సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు ఉపరితలం నుండి గాల్లోకి క్షిపణులు, టార్పెడోలు ప్రయోగించగలదని మరియు ఆధునిక నావికా ఫిరంగులతో ఆయుధాలు కలిగి ఉందని ఇరాన్ నివేదికలు తెలిపాయి.

కాగా,ఈ ఏడాది ప్రారంభంలోఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్‌కి చెందిన ఎయిర్ లైన్స్ విమానాన్నిఇరాన్ పొరపాటున పేల్చేసిన ఘటనలో 176మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  అయితే, అది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి కాదని.. మానవతప్పిదం వల్ల జరిగిన పొరపాటు అని ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహాని తెలిపారు. తమ తప్పిదం వల్ల నష్టపోయిన దేశ ప్రజలు, మృతుల కుటుంబాలు, ఘటనతో ముడిపడి ఉన్న దేశాలకు ఆయన క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.

Read Here>>  బోర్డర్ లో కొట్టుకున్న భారత్-చైనా సైనికులు, పలువురికి గాయాలు, అసలేం జరిగిందంటే..