Saraswati Yoga 2026 : అరుదైన సరస్వతి యోగం.. ఈ నాలుగు రాశుల వారి జాతకం మారబోతుంది… కష్టాలు పరార్.. డబ్బే డబ్బు..!
Saraswati Yoga 2026 : మే 29, శుక్రవారం నాడు అరుదైన సరస్వతి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల 4 రాశుల వారికి అమితంగా కలిసి వస్తుంది.
Saraswati Yoga 2026 These four Zodiac Signs May Get Huge Luck From May 29
Saraswati Yoga 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుద్ధికి అధిపతి అయిన బుధుడు, జ్ఞానం మరియు శుభఫలితాలకు అధిపతి అయిన గురుడు, అలాగే మనకు సుఖసంతోషాలు, వైభవాన్ని ప్రసాదించే శుక్రుడు.. ఈ మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు అత్యంత అరుదైన “సరస్వతి యోగం” ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. రేపే, అనగా.. 2026 మే 29న ఈ అరుదైన సరస్వతి యోగం ఏర్పడనుంది.
మే 29 శుక్రవారం నాడు బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే ఈ రాశిలో గురు, శుక్ర గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. ఒకే రాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల ఏర్పడే సరస్వతి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి విశేష లాభాలు కలగనున్నాయని జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ చూద్దాం:
1. మిథున రాశి:
మిథున రాశిలోనే బుధ, గురు, శుక్ర గ్రహాల సంచారం వల్ల ఈ సరస్వతీ యోగం ఏర్పడుతోంది. కాబట్టి, ఈ యోగం మిథున రాశి వారికి అత్యంత అనుకూలంగా మారనుంది.
- మే 29 నుంచి వీరు తీసుకునే నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి.
- సరస్వతి యోగం వల్ల వీరి వాక్చాతుర్యం పెరిగి, ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు.
- వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించవచ్చు.
- ఈ అరుదైన యోగం వల్ల వీరు పెద్ద ప్రాజెక్టులు లేదా పెట్టుబడులపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు.
- విద్య, కమ్యూనికేషన్, క్రియేటివ్ రంగాల్లో ఉన్న మిథున రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం.
2. కన్యా రాశి:
అరుదైన సరస్వతి యోగం వల్ల.. మే 29 తర్వాత నుంచి కన్యా రాశి వారికి ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో అద్భుతమైన ప్రగతి కనిపించే అవకాశాలు ఉన్నాయి.
- ప్రస్తుతం పని చేస్తున్న చోట వీరి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
- పై అధికారుల నుంచి కొత్త బాధ్యతలు, లేదంటే ప్రమోషన్ పొందేందుకు అవకాశం ఉంది.
- ఈ రాశి వారికి జీతం పెరగడమే కాకుండా, గతంలో నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది.
- సరస్వతి యోగం ప్రభావంతో కన్య రాశి వారు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే అత్యుత్తమ సమయం.
3. తులా రాశి:
మే 29 శుక్రవారం నాడు ఏర్పడే సరస్వతి యోగం వల్ల తులా రాశి వారికి ఆర్థికంగా విశేషంగా కలిసి వస్తుంది.
- ఈ రాశి వారి ఆదాయం పెరగడానికి అనేక కొత్త మార్గాలు సుగమం అవుతాయి.
- గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను అందించే సూచనలు కనిపిస్తున్నాయని పండితులు చెబుతున్నారు.
- కుటుంబ ఆస్తులు లేదా పాత పెట్టుబడుల ద్వారా కూడా ఊహించని ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి.
- మొత్తంగా ఈ కాలంలో తులా రాశి వారికి అనేక అంశాల్లో అదృష్టం తోడుగా ఉంటుంది.
4. కుంభ రాశి:
అరుదైన సరస్వతి యోగం వల్ల కుంభ రాశి వారికి అనేక రంగాల్లో విజయ అవకాశాలు మెరుగవుతాయి.
- ముఖ్యంగా కళలు, సృజనాత్మక రంగాలు, మీడియా మరియు వినూత్న ఆలోచనలతో పనిచేసే వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
- మీరు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- ఆర్థిక స్థిరత్వం పెరిగి.. కొత్త వ్యాపార లేదా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.
- గురు, బుధ, శుక్ర గ్రహాల అనుకూల ప్రభావంతో ఈ సమయంలో కుంభ రాశి వారి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.
