Rain Alert : రెయిన్ అలర్ట్.. ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్అలర్ట్.. భీకర గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు..
Rain Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వారంరోజుల పాటు వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Meteorological Department has issued red alert for several districts in AP
- ఏపీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు
- రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
- అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Rain Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వారంరోజుల పాటు వర్షాలు దంచికొడతాయని, భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : Pawan Kalyan: సై అంటే సై.. కాంగ్రెస్ లీడర్లు పవన్ కల్యాణ్ ని ఎందుకు టార్గెట్ చేశారు? కారణం అదేనా..
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కేరళ, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షంకుతోడు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడాఉంటుందని, 40 నుంచి 42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
బుధవారం (ఇవాళ) ఏపీలోని అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటలకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
🔴 ఏపీలో పలు జిల్లాలకి రెడ్ అలెర్ట్:
అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నంది pic.twitter.com/UNcgCROGHL
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) June 2, 2026
భారీగా ఈదురుగాలులు, వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రదేశాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
