Sachin Tendulkar : ఐపీఎల్లో భారీ మార్పులు చేయాలి.. ఈ నిబంధనను రద్దు చేయాలని.. సచిన్ టెండూల్కర్ సూచన
టీ20 క్రికెట్లో బ్యాట్, బాల్‌కు మధ్య సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కొన్ని విప్లవాత్మక సంస్కరణలను ప్రతిపాదించారు.
Sachin Tendulkar Suggests Radical Changes To Indian Premier League
Sachin Tendulkar : టీ20 క్రికెట్లో బ్యాట్, బాల్‌కు మధ్య సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొన్ని విప్లవాత్మక సంస్కరణలను ప్రతిపాదించారు. ఇటీవల కాలంలో టీ20 అంటే బ్యాటర్ల ఆటగా మారిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్లో బ్యాటర్ల హవా చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో రికార్డు స్థాయిలో 200కిపైగా స్కోర్లు నమోదు అవుతున్నాయి.
ఈఎస్‌పీఎల్ క్రిక్ఇన్ఫో అవార్డ్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్ పలు మార్పులను సూచించాడు.
రెండు పవర్ ప్లేలు..
పవర్‌ప్లేను రెండు భాగాలుగా విభజించాలని, ఒక భాగాన్ని బ్యాటర్లకు, మరొక భాగాన్ని బౌలింగ్ చేసే జట్టుకు కేటాయించాలని సచిన్ సూచించారు. పవర్ ప్లలో మొదటి నాలుగు ఓవర్లు బ్యాటర్ల కోసం అని, ఆ తరువాత రెండు ఓవర్లు బౌలర్ల కోసం అని చెప్పాడు.
తొలి నాలుగు ఓవర్లలో ఇప్పుడు ఉన్నట్లుగానే 30-గజాల సర్కిల్ వెలుపల గరిష్టంగా ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉండాలన్నాడు. మిగిలిన రెండు ఓవర్లను ఫీల్డింగ్ కెప్టెన్ తనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవాలన్నాడు. ఆ రెండు ఓవర్ల సమయంలో 30 గజాల సర్కిల్ వెలుపల గరిష్టంగా 3 ఫీల్డర్లు మాత్రమే ఉండాలన్నాడు.
ఓ బౌలర్‌కు ఐదు ఓవర్లు..
టీమ్‌లోని ఓ బౌలర్ ఐదు ఓవర్లు వేసేందుకు అనుమతి ఇవ్వాలని సచిన్ సూచించాడు. ప్రస్తుతం బౌలర్లు గరిష్టంగా నాలుగు ఓవర్లు మాత్రమే వేయగలరు అన్న సంగతి తెలిసిందే. ఈ చిన్ని మార్పు కారణంగా మధ్య ఓవర్ల గతి మారిపోతుందన్నాడు. తద్వారా అత్యుత్తమ బౌలర్ ప్రమాదకరమైన భాగస్వామ్యాలను విడగొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నాడు.
*Harmanpreet Kaur : టీ20ల్లో హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన ఘనత..
ఇంపాక్ట్ ప్లేయర్ రద్దు..
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను రద్దు చేయాలని సచిన్ టెండూల్కర్ కోరాడు. టీ20 మ్యాచ్‌లో కేవలం 20 ఓవర్లు మాత్రమే ఆడతారని, 11 మంది కాకుండా ఇంకొక ఎక్స్ ట్రా బ్యాటర్ ను ఆడించడం ద్వారా లోయర్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలుతుందనే భయం లేకుండా జట్టు 20 ఓవర్ వరకు దూకుడిగా గుడ్డిగా ఆడేస్తుందన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల ఆల్రౌండర్లకు విలువ తగ్గుతుందన్నాడు.
